మీరు లక్షాధికారి కావ‌డం ఖాయం.. నెల‌కు రూ. 12500 ప‌క్క‌న పెడితే రూ. 40 ల‌క్ష‌లు మీ సొంతం

Published : Nov 16, 2025, 01:40 PM IST

Post office: డ‌బ్బులు సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో వాటిని స‌రైన విధానంలో ఇన్వెస్ట్ చేయ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి వారి కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ పోస్టాఫీస్ మంచి ప‌థ‌కాల‌ను తీసుకొచ్చాయి.  

PREV
15
భద్రతతో కూడిన మంచి పెట్టుబడి

భ‌ద్ర‌త‌తో పాటు మంచి రాబ‌డి కోరుకునే వారికి పోస్టాఫీస్ అందిస్తోన్న PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇది కేంద్రం మద్దతు ఉన్న సేవింగ్ పథకం కాబట్టి డబ్బు కోల్పోయే ప్రమాదం లేదు. మార్కెట్ ఎత్తుపల్లాలు ఉండే స్కీమ్స్‌తో పోలిస్తే ఇది స్థిరంగా ఉంటుంది.

25
రూ. 40 ల‌క్ష‌లు ఎలా సంపాదించాలంటే.?

ప్రతి నెలా రూ. 12,500 చొప్పున లేదా ఏడాదికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 ఏళ్లలో దాదాపు రూ. 40.68 లక్షలు చేరతాయి. ఈ లెక్క‌న మీరు 15 ఏళ్ల‌లో మీరు పెట్టుబ‌డి పెట్టే మొత్తం రూ. 22.5 ల‌క్ష‌లు అవుతుంది. మీకు వ‌డ్డీ రూపంలోనే రూ. 18 ల‌క్ష‌లు పొందొచ్చు. ఈ మొత్తంపై పూర్తిగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ చేతికి వస్తుంది.

35
మూడు రకాల ట్యాక్స్ లాభాలు

PPF స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. జమ చేసే డబ్బుకు, వచ్చే వడ్డీకి, చివర్లో పొందే మొత్తానికి పన్ను ఉండదు. ఈ “ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్” చాలా అరుదైన పథకాల్లోనే లభిస్తుంది. అధిక ఆదాయం పొందేవాళ్లే మాత్ర‌మే కాకుండా, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది మంచి ప‌థ‌కంగా చెప్పొచ్చు.

45
కేవలం రూ. 500తో ప్రారంభించవచ్చు

ఈ పథకంలో ఖాతా తెరవడానికి అధిక డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 500తో కూడా ప్రారంభించవచ్చు. PPF కాలపరిమితి 15 ఏళ్లు. కావాలంటే తర్వాత 5 ఏళ్ల చొప్పున పెంచుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల పొదుపు అలవాటు మ‌రింత పెరుగుతుంది.

55
అవసర సమయంలో డబ్బు తీసుకునే అవకాశం

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతూనే, అవసరమైతే డబ్బు మీద అప్పు కూడా తీసుకోవచ్చు. ప్రారంభ 5 ఏళ్లు పూర్తయ్యాక పాక్షికంగా డబ్బు తీసుకోగలరు. దీర్ఘకాల పొదుపుతో పాటు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఉపయోగపడే ప్రయోజనం ఇది.

Read more Photos on
click me!

Recommended Stories