Invest 12500 Get 40 Lakh Return: భారతీయ పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌లో 7.1% వడ్డీతో ₹12,500 ఇన్వెస్ట్ చేస్తే మీరు ₹40 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీమ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Post Office పీపీఎఫ్ Scheme : అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్
Post Office Scheme : భారత పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలతో దూసుకుపోతోంది. పోస్టాఫీసు అందించే పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రాచుర్యం పొందింది. దీన్ని ఎక్కువగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకుంటారు. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా, ఈ స్కీమ్‌లో లభించే వడ్డీతో పాటు మెచ్యూరిటీ మొత్తమంతా టాక్స్ ఫ్రీగా ఉంటుంది.
పెట్టుబడిదారులు కనీసం ₹500 నుండి గరిష్టంగా ₹1.5 లక్షల వరకు సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు. దీర్ఘకాల సేవింగ్స్ కోసం ఇది సురక్షితమైన ఎంపికగా ఉంటుంది.
24
రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి ఎలా వస్తుంది?
ఈ పోస్టాఫీసు మని మేకింగ్ స్కీమ్ ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ రాబడి పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలకు ₹12,500 పెట్టుబడి చొప్పున పెడితే, 15 ఏళ్లలో మొత్తం ₹22.5 లక్షలు డిపాజిట్ చేసినవారవుతారు.
ఇందుకు 7.1 శాతం వడ్డీతో అదనంగా ₹17.47 లక్షలు వస్తాయి. ఇలా కలిపితే ₹40 లక్షలకు పైగా రాబడి లభిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది.
34
పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ లో రుణ సౌకర్యం
ఈ దీర్ఘకాలిక స్కీమ్ పెట్టుబడిదారులకు రాబడితో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయ్యాక రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఖాతా 5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సాయం పొందవచ్చు.
పోస్టాఫీసు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవడం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో
సేఫ్టీ: ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పథకం కావడంతో పెట్టుబడి భద్రత ఉంటుంది.
టాక్స్ సేవింగ్స్: ఇందులో పెట్టిన డబ్బుపై, వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్: దీర్ఘకాలం పాటు పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది.
దీని వలన కోట్లాది మంది భారతీయులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.
నిపుణుల సలహా అవసరం: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి చేయడానికి ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉండటంతో, సరైన ఎంపికలు, నిర్ణయాలు తీసుకోవాలి.