Youtube: మనకు రూ.89కే యూట్యూబ్ ప్రీమియం లైట్, ఇంత చవకధరకు సబ్ స్క్రిప్షన్

Published : Sep 30, 2025, 07:46 PM IST

యూట్యూబ్ (Youtube) సబ్ స్క్రిప్షన్ సేవలు మొదలుపెట్టేసింది. ఇప్పటికే విపరీతంగా ప్రకటనల ద్వారా సంపాదిస్తోంది. ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ ద్వారా కూడా మరింతగా సంపాదించబోతోంది. మనదేశంలో ప్రీమియం లైట్ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 

PREV
13
యూట్యూబ్ ప్రీమియం లైట్

యూట్యూబ్ సంస్థ గూగుల్ యాజమాన్యంలో నడుస్తోంది.  యూట్యూబ్ ఇప్పుడు మనదేశంలో కొత్త ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు వీడియోలను మధ్యలో యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు.  మ్యూజిక్ కంటెంట్, షార్ట్స్‌లో మాత్రం మధ్యల యాడ్స్ వస్తాయి. సెర్చ్, బ్రౌజింగ్ టైంలో కూడా ప్రకటనలు కనిపించే అవకాశం ఉంది. 

23
చాలా తక్కువ ధరకే సబ్ స్క్రిప్షన్

భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం లైట్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ.89, ప్రీమియం నెలకు రూ.149కి అందుబాటులో ఉంది. లైట్ యూజర్లు వీడియోలను యాడ్స్ లేకుండా  చూడగలరు. కానీ ప్రీమియం యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, వీడియో డౌన్‌లోడ్స్ వంటి అదనపు ఫీచర్లు పొందుతారు.

33
ప్రీమియం లైట్ ఫీచర్లు

భారతీయ ప్రేక్షకులకు బడ్జెట్‌కు అనుగుణంగా ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. ఇది ముఖ్యంగా యాడ్స్ వద్దనుకునే, కానీ మ్యూజిక్ లేదా అదనపు ఫీచర్లు పెద్దగా వాడని వారి కోసం ఉద్దేశించింది.

Read more Photos on
click me!

Recommended Stories