Post office: రిస్క్ లేకుండా డబ్బులను పెట్టుబడి పెట్టాలని చాలా మంది కోరుకుంటారు. ఇలాంటి వారి కోసమే పోస్టాఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోన్న మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ ప్రభుత్వ భద్రతతో పనిచేసే ఒక పథకం. దీని ముఖ్య లక్ష్యం ప్రజలకు నెలనెలా నిరంతర ఆదాయం అందించడం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం రిస్క్ నుంచి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వడ్డీ రేటు మారినా, మీరు పెట్టుకున్న కాలానికి అదే రేటు కొనసాగుతుంది. ప్రతి నెలా ఒకే మొత్తం మీ ఖాతాలోకి డబ్బు వస్తుంది. 5 ఏళ్లు పూర్తైన తర్వాత మీ పెట్టుబడి మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందుతారు.
25
ఎంత వరకు పెట్టుబడి పెట్టొచ్చు?
వ్యక్తులకు పెట్టుబడి పరిమితులు ఇలా ఉన్నాయి:
సింగిల్ అకౌంట్: గరిష్ఠం రూ.9 లక్షలు
జంట అకౌంట్: గరిష్ఠం రూ.15 లక్షలు
అంటే భర్త–భార్య కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే 10 లక్షలు సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
35
తాజా వడ్డీ రేటు ఎంత? వడ్డీ ఎలా లెక్కిస్తారు?
ప్రస్తుతం MISపై ప్రభుత్వంచే ఇచ్చే వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%గా ఉంది. ఈ వడ్డీ ప్రతి నెలా మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతుంది. వడ్డీ నిరంతరం స్థిరంగా ఉంటుంది. వడ్డీ నెలకు ఒకసారి జమ అవుతుంది. 5 ఏళ్ల వరకు వడ్డీ తగ్గదు. వడ్డీని మరో సేవింగ్ పథకంలో పెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు.
మీరు ఒకవేళ జాయింట్ అకౌంట్‌లో రూ. 10 లక్షల పెట్టారని అనుకుందాం. వార్షిక వడ్డీరేటు 7.4 శాతంగా ఉంటుంది. ఈ లెక్కన మీకు ప్రతీ నెల రూ. 6,166 వడ్డీ రూపంలో లభిస్తాయి. ప్రతి నెలా ఈ మొత్తం మీ సేవింగ్ అకౌంట్‌లోకి పడుతుంది. ఇది చిన్న కుటుంబాలకు మంచి ఆదాయం అవుతుంది.
55
5 ఏళ్లకు మొత్తం లాభం ఎంత?
5 ఏళ్ల కాలానికి చూస్తే మొత్తం 60 నెలలకు రూ. 3,69,960 వడ్డీ రూపంలో లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మీ మొత్తం రూ. 13,69,960 అవుతుంది. ఎలాంటి రిస్క్ లేకుండా ఐదేళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే మీరు సుమారు రూ. 3.7 లక్షలు పొందొచ్చన్నమాట.