మీ దగ్గర ఆధార్, ఓటర్ కార్డుల్లో ఏ ఒక్కటి వున్నా... ఈజీగా రూ.50,000 అందుకొండి..!!

Published : Aug 05, 2024, 05:30 PM ISTUpdated : Aug 05, 2024, 06:20 PM IST

మీ దగ్గర కేవలం ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడీ కార్డు వుంటే చాలు... చాలా ఈజీగా 50,000 వేల రూపాయలను పొందవచ్చు. ఎలాగో తెలుసా..?  

PREV
110
మీ దగ్గర ఆధార్, ఓటర్ కార్డుల్లో ఏ ఒక్కటి వున్నా... ఈజీగా రూ.50,000 అందుకొండి..!!
PM Svanidhi

PM Svanidhi : మనం ఏదయినా పనిపై బ్యాంకుకు వెళితే సవాలక్ష ఫార్మాలిటీస్ వుంటాయి. చివరకు మన అకౌంట్ లోని డబ్బులు తీసుకోవాలన్నా విత్ డ్రా ఫామ్ ఫీల్ చేసి క్యూలో నిలబడి తీసుకోవాలి. ఇక ఏ హోమ్ లోనో, బిజినెస్ లోనో కావాలంటే    బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. అలాంటి బ్యాంకుల్లో కేవలం ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి కార్డు వుంటే ఇట్టే రూ.50,‌000 పొందవచ్చు. అదెలాగో తెలుసుకొండి. 
 

210
PM Svanidhi

ప్రధానమంత్రి స్వనిధి యోజన : 

కరోనా మహమ్మారి చాలామంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్ బారినపడి కొందరు మరణించారు... మరికొందరేమో జీవనోపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇలా కరోనా వ్యాప్తిని అరికట్టేండుకు లాక్ డౌన్ విధించి యావత్ దేశాన్ని స్తంభింపజేసారు. దీంతో చాలామంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకమే ప్రధానమంత్రి స్వనిధి యోజన.  
 

310
PM Svanidhi

కరోనా సమయంలో కోలుకోలేని దెబ్బతిన్నది వీధి వ్యాపారులు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద వ్యాపారులు కరోనా కష్టకాలంలో కుటుంబాన్ని పోషించుకోడానికి నానా అవస్తలు పడ్డారు.అలాంటివారు పరిస్థితి మెరుగుపడ్డాక కూడా తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించుకోడానికి పెట్టుబడి లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. వీరి బాధను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఎలాంటి హామీ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసమే పీఎం స్వనిధి యోజనను తీసుకువచ్చింది. 
 

410
PM Svanidhi

ఆత్మనిర్భన్ భారత్ అభియాన్ కింద చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు 2020, జూన్ 1 న పీఎం స్వనిధి స్కీమ్ ప్రారంభించారు. ఇప్పటికే లక్షలాదిమంది చిరు వ్యాపారులు ఈ రుణాన్ని పొందారు... ఇది వారికెంతో ఉపయోగకరంగా వుంది. 
 

510
PM Svanidhi

పీఎం స్వనిధి రుణం పొందడం ఎలా :  

పీఎం స్వనిధి అధికారిక వెబ్ సైట్ https://pmsvanidhi.mohua.gov.in/ ను సందర్శించి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకొండి. లేదంటే ఈ లోన్స్ అందిస్తున్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులను సందర్శించి అధికారుల ద్వారా వివరాలు తెలసుకొండి. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా పీఎం స్వనిధి లోన్స్ అందిస్తున్నాయి.
 

610
PM Svanidhi

చిరు వ్యాపారులు పూర్తి లబ్ది పొందాలంటే : 
 
ఈ పథకాన్ని పొందాలంటే ఎలాంటి హామీ అవసరం లేదు. కేవలం ఆదార్ కార్డు లేదంటే ఓటర్ ఐడీ కార్డు వుంటే చాలు... మీరు పీఎం స్వనిధి కింద రుణం పొందవచ్చు. అయితే ఒకేసారి కాకుండా విడతల వారిగా రూ.50 వేల రుణాన్ని అందిస్తారు. 

710
PM Svanidhi

మీకు పీఎం స్వనిధి రుణంకోసం దరఖాస్తు చేసుకుంటే ముందుగా మీ వ్యాపార వివరాలతో పాటు ఆధార్, ఓటర్ ఐడీ కార్డులతో ఏదో ఒకటి సమర్పించాల్సి వుంటుంది. దీంతో లోన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. మీకు ఈ లోన్ పొందేందుకు అన్ని అర్హతలు వుంటే ముందుగా రూ.10 వేలు అందిస్తారు.  
 

810
PM Svanidhi

ఇలా మీరు పొందిన రుణంతో వ్యాపారం చేసుకుంటూ సకాలంలో తిరిగి చెల్లిస్తే మరో 20 వేల రూపాయలు ఇస్తారు.వాటిని కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లిస్తే మరో రూ.20 వేలు ఇస్తారు. ఇలా మూడు విడతల్లో రూ.50వేల రుణాన్ని అందిస్తారు.   సకాలంలో రుణం చెల్లించిన వ్యాపారులు వడ్డీ రాయితీని కూడా పొందవచ్చు. 
 

910
PM Svanidhi

ఈ లోన్ విధానం : 

మొదటి విడతలో రూ.10 వేల రుణం పొందినవారు 12 నెలలోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. అయితేనే మరో రూ.20 వేలు పొందేందుకు అర్హులు. ఈ రుణాన్ని గరిష్టంగా 18 నెలల్లోపు చెల్లించాలి. దీన్ని కూడా సకాలంలో చెల్లించినవారికి మరో 20 వేలు వస్తుంది. నెలవారి వాయిదాల్లో రుణం మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది. 
 

1010
PM Svanidhi

ఇలా ఇప్పటివరకు అనేకమంది వీధి వ్యాపారులు పీఎం స్వనిధి రుణాన్ని పొంది లాభపడ్డారు. వ్యాపారం సజావుగా సాగడంతో రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించారు. ఇలా ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు అండగా నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories