అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అభివృద్ధి
మధ్యప్రదేశ్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దేశంలోనే మొదటి ప్రపంచ స్థాయి మోడల్ స్టేషన్, ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందించారు. ఈ స్టేషన్‌ను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. రాణి కమలాపతి స్టేషన్ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.450 కోట్లు.
రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లకు చేరుకోవడానికి స్టేషన్‌లో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఓపెన్ కాన్‌కోర్స్‌లో 700 నుంచి 1,100 మంది ప్రయాణికులకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు. రైళ్ల రాకపోకల సమాచారం కోసం స్టేషన్ అంతటా వివిధ భాషల డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఫుడ్ కోర్ట్, రెస్టారెంట్, ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ రూమ్, హాస్టల్, వీఐపీ లాంజ్ కూడా ఉన్నాయి. స్టేషన్‌లో దాదాపు 160 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.