పాన్ కార్డ్ అప్‌డేట్: ఇప్పుడు 18 ఏళ్లలోపు వారు కూడా పాన్ కార్డ్ పొందవచ్చు.. ఎలా అంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Nov 13, 2021, 02:26 PM IST

ఏదైనా ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ (pancard)చాలా ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో నగదు బదిలీకి, అలాగే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి లేదా ఏదైనా ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డ్  అవసరం.పాన్ కార్డ్‌ సాధారణంగా 18 ఏళ్ళు నిండిన తర్వాత లభిస్తుంది  కానీ  18 ఏళ్లలోపు ఉన్న వారు  కూడా పొందవచ్చు.

PREV
13
పాన్ కార్డ్ అప్‌డేట్: ఇప్పుడు 18 ఏళ్లలోపు  వారు కూడా  పాన్ కార్డ్ పొందవచ్చు.. ఎలా అంటే ?

మీరు మీ పిల్లల పాన్ కార్డ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే ఇందుకు ఈ సూచనలను జాగ్రత్తగా పాటించాలి.


18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పాన్ కార్డ్

మీరు 18 ఏళ్లలోపు పిల్లల కోసం పాన్ కార్డ్ దరఖాస్తు చేయాలనుకుంటే ఇప్పుడు చాలా సులభం. అయితే మైనర్లు ఎవరైనా సరే సొంతంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరని గుర్తించుకోవాలి. కానీ పిల్లల తల్లిదండ్రులు వారి తరపున దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్  కోసం సులభమైన ప్రక్రియ  :

మీరు ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ముందుగా ఎన్‌ఎస్‌డి‌ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

సంబంధిత అభ్యర్థి క్యాటగిరి ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం మొత్తం వెల్లడించాలి.
 

23

మీరు ఇప్పుడు మైనర్ వయస్సు ప్రూఫ్ తో పాటు తల్లిదండ్రుల ఫోటోతో సహా  ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయవచ్చు.

 ఇప్పుడు తల్లిదండ్రుల సంతకాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి.

రూ. 107 ఛార్జీని చెల్లించిన తర్వాత మీరు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

దినిని అనుసరించి మీకు రసీదు నంబర్ లభిస్తుంది, దీనిని మీరు మీ దరఖాస్తు స్టేటస్ తనిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు.

 మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు ఇమెయిల్ వస్తుంది.

వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మీరు 15 రోజులలోపు మీ పాన్ కార్డ్‌ని అందుకుంటారు.

33

ఈ డాక్యుమెంట్స్ అవసరం:

పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి  కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించడం అవసరం.

మైనర్ తల్లిదండ్రుల చిరునామా ఇంకా గుర్తింపు కన్ఫర్మేషన్ అవసరం. 

దరఖాస్తుదారుడి చిరునామా ఇంకా గుర్తింపు పత్రం అవసరం.

అదనంగా మైనర్  సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఈ డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐ‌డి.

అడ్రస్ వెర్ఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ కాపీ, పోస్టాఫీసు పాస్‌బుక్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్  అవసరం.

పిల్లలు డబ్బు సంపాదించినప్పుడు మీ పెట్టుబడికి నామినీ కావాలనుకుంటే లేదా పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టినట్లయితే, వారికి పాన్ కార్డ్ అవసరం.

click me!

Recommended Stories