దీపావళి కన్నా ముందే రైతుల జేబులు డబ్బులతో నింపనున్న మోదీ ప్రభుత్వం, PM Kisan Yojana 12 విడత డబ్బులు ఎప్పుడంటే

Published : Oct 07, 2022, 03:48 PM IST

మీరు కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులైతే ఇది మీకు ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకుంటే  కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మీ దీపావళి పండుగను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సిద్ఠం అవుతోంది. దీపావళికి ముందే మోడీ ప్రభుత్వం రైతులకు కానుకగా ఇచ్చిందని చెప్పుకుందాం.

PREV
16
దీపావళి కన్నా ముందే రైతుల జేబులు డబ్బులతో నింపనున్న మోదీ ప్రభుత్వం, PM Kisan Yojana 12 విడత డబ్బులు ఎప్పుడంటే

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Agriculture and Farmers Welfare) జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 12వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని 2022 అక్టోబర్ 17,  18 తేదీల్లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

26

ఇటీవల అగ్రి-స్టార్టప్ కాన్క్లేవ్ & కిసాన్ సమ్మేళన్ (Agri-startup Conclave & Kisan Sammelan) నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాలో నగదు బదిలీ చేయవచ్చనే సూచనలు వెలువడ్డాయి. దేశంలోని రైతులు 12వ విడత కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి, ఈసారి ఇ-కెవైసి ప్రక్రియ,  రైతుల డేటాబేస్ ధృవీకరణ కారణంగా, పిఎం కిసాన్ సహాయం మొత్తంలో జాప్యం జరిగింది.

36

ప్రభుత్వం ఇప్పటికే 11 వాయిదాల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది
ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో 11 వాయిదాల జమ చేసిన ప్రభుత్వం.. 11వ విడత సొమ్ము మే 31న బదిలీ అయింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు నాలుగు నెలల వ్యవధిలో మూడు విడతలుగా రూ.2000 చొప్పున విడుదల చేస్తుంది. ఇలా ఏడాదికి మూడు విడతలుగా రైతులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు.

46

e-KYC చేయకపోతే మీకు డబ్బు రాదు
ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుబంధించబడిన లబ్ధిదారులందరికీ ఇ-కెవైసి చేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ-కేవైసీ చేయని రైతుల 12వ విడత సొమ్ము నిలిచిపోవచ్చు. పిఎం కిసాన్ కింద ఇ-కెవైసికి ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఇప్పుడు ఈ తేదీ దాటిపోయింది. అటువంటి పరిస్థితిలో, వారి e-KYC పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే PM కిసాన్ డబ్బును పొందుతారు.

56

భూమి యాజమాన్యం తప్పనిసరి
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రైతు భూమి అతని పేరు మీదనే ఉండాలి. ఒక రైతు వ్యవసాయం చేస్తుంటే, ఆ పొలం అతని పేరు మీద కాకుండా అతని తండ్రి లేదా తాత పేరు మీద ఉంటే, అటువంటి పరిస్థితిలో అతను సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని కోల్పోవలసి ఉంటుంది. పీఎం కిసాన్‌లో భూమి యాజమాన్యం తప్పనిసరి. PM కిసాన్ కింద, మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు మరియు మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు వస్తుందని మీకు తెలియజేద్దాం.

66

ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి
రైతుల కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దరఖాస్తు చేసుకున్నట్లయితే, దాని స్థితిని తెలుసుకోవడానికి మీరు 155261కి కాల్ చేయవచ్చు. మీరు దీని గురించి అన్ని రకాల సమాచారాన్ని పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories