ఇక మీరు లాభసాటిగా వ్యాపారం చేయాలంటే, శివకాశి వెళ్లి హోల్ సేల్ ధరలకే టపాసులు కొనగోలు చేయాలి. అక్కడ MRP ధరల కన్నా కూడా కేవలం 20-40 శాతం ధరలకే టపాసులు లభిస్తాయి. మీరు వాటిని స్థానికంగా MRP కన్నా 25 శాతం తక్కువకు అమ్మినా రెండింతలు లాభం పొందవచ్చు. అయితే శివకాశిలో అనేక కుటీర పరిశ్రమల్లో టపాసులు తయారు చేస్తుంటారు. వాటిని మీరు క్వాలిటీ ఉన్న సరుకు తెచ్చుకుంటే మంచిది. లేకపోతే మీ వద్ద సరుకు అమ్ముడు పోకుండా ఉండే ప్రమాదం ఉంది.