మీరు రైతులా, అయితే ఈ కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది...వెంటన్ చెక్ చేసుకోండి..

First Published | Oct 6, 2022, 1:10 PM IST

రెనాల్ట్ ఇండియా ఈ పండుగ సీజన్‌లో తన అనేక వాహనాలపై ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ నెలలో వాహనాల కొనుగోలుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును ప్రకటించింది.

రైతులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తమ సేల్స్ పెంచుకునేందుకు, ప్రముఖ బ్రాండ్ రెనాల్ట్ సరికొత్త ఆఫర్లను ముందుకుతెచ్చింది. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ కారు వేరియంట్, గ్రేడ్‌ ను బట్టి మారే అవకాశం ఉంది. కంపెనీ ప్రకారం, పండుగ ఆఫర్‌లు మోడల్‌ ను బట్టీ మారుతూ ఉంటాయి  దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మినహాయింపులు అక్టోబర్ 31, 2022 వరకు వర్తిస్తాయి. మోడల్ వారీగా తగ్గింపులు క్రింద అందుబాటులో ఉన్నాయి.

రెనాల్ట్ ఇండియా ఈ పండుగ సీజన్‌లో తన అనేక వాహనాలపై ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ నెలలో వాహనాల కొనుగోలుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును ప్రకటించింది.


రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) :

రెనాల్ట్ ట్రైబర్ పై గరిష్టంగా రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ. 15,000 (RXT, RXZ వేరియంట్‌లపై)  రూ. 10,000 (RXL  లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లపై) క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా, కంపెనీ ఈ మోడళ్లపై రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్  రూ. 10,000 వరకు కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. గ్రామీణ ఆఫర్ కింద రైతులు, సర్పంచ్,  గ్రామ పంచాయతీ సభ్యులు రూ.5,000 వరకు రాయితీ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందడానికి రెనాల్ట్ ధృవీకరించిన పత్రాలను కంపెనీకి సమర్పించాలి. కార్పొరేట్ లేదా గ్రామీణ ఏ కస్టమర్ అయినా ఈ రెండు ఆఫర్‌లలో ఒకదాన్ని మాత్రమే పొందగలరు. అదే సమయంలో, రిలీవ్ స్క్రాపేజ్ పాలసీ కింద రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

రెనాల్ట్  క్విడ్

రెనాల్ట్  ఎంట్రీ-లెవల్ మోడల్ క్విడ్ రూ. 35,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ అన్ని వేరియంట్లపై రూ.10,000 వరకు తగ్గింపును ఆఫర్ చేసింది. 1.0-లీటర్ ఇంజన్‌పై 15,000 వరకూ  0.8-లీటర్ వేరియంట్‌లపై రూ. 10,000 వరకు. డిస్కౌంట్ ఉంది. అదే సమయంలో, కస్టమర్‌లు ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. లాయల్టీ ప్రయోజనం RXE 0.8-లీటర్ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 వరకు  గ్రామీణ్ పథకం కింద రూ. 5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

రెనాల్ట్ కైగర్ (Renault Kiger)

క్విడ్  ట్రైబర్ వంటి కార్పొరేట్  గ్రామీణ ప్రోగ్రామ్‌లకు అందుబాటులో ఉన్న తగ్గింపులు రెనాల్ట్ కైగర్ పై ఇవ్వబడ్డాయి. కైగర్‌పై ఎలాంటి నగదు తగ్గింపును అందించలేదు. రిలైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద మీరు ఈ కాంపాక్ట్ SUVపై రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Latest Videos

click me!