కరోనా ఎఫెక్ట్, ఆంక్షల కారణంగా మే నెలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. గత నెలతో పోల్చితే..

First Published Jun 2, 2021, 4:02 PM IST

 ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైల్ ఇంధన సంస్థల ప్రాథమిక సమాచారం ప్రకారం, పెట్రోల్ అమ్మకాలు మే నెలలో 1.79 మిలియన్ టన్నులకు పడిపోయాయి. అయితే ఈ వినియోగం గత ఏడాది మే కంటే 13 శాతం అధికంగా ఉంది.

ప్రీ-కోవిడ్ స్థాయిలో 24.9 లక్షల టన్నుల కంటే 28 శాతం తక్కువ. గత ఏడాది మేలో దేశంలో విధించిన లాక్‌డౌన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్ లో ఒకటి కావడం గమనార్హం. ఈ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు దేశంలో దాదాపుగా పూర్తిగా నిలిచిపోయాయి.
undefined
ఈ సంవత్సరంలో కరోనా వ్యాప్తి రేటు తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆంక్షల సడలింపు ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో కర్మాగారాలు తెరవబడ్డాయి, మరికొన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా అంతగా ప్రభావితం చేయలేదు.
undefined
దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనమైన డీజిల్ డిమాండ్ 2021 మేలో 4.89 మిలియన్ టన్నులకు పడిపోయింది. అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం తక్కువ. 2019 మేతో పోలిస్తే 30 శాతం తగ్గింది.
undefined
విమానయాన సంస్థలు కూడా తక్కువ సామర్థ్యంతో పనిచేయడం కొనసాగించాయి, అయితే మే నెలలో జెట్ ఇంధనం (ఎటిఎఫ్) అమ్మకాలు 2.48 వేల టన్నులుగా ఉంది.
undefined
ఏప్రిల్ 2021తో పోలిస్తే 34 శాతం తక్కువ. మే 2019తో పోలిస్తే 61.3 శాతం తగ్గింది. గత ఏడాది మే నెలలో జెట్ ఇంధన అమ్మకం 1.9 లక్షల టన్నులు.
undefined
మే 2021లో ఎల్‌పి‌జి సిలిండర్ల అమ్మకాలు 6 శాతం తగ్గి 21.6 మిలియన్ టన్నులకు చేరుకుంది. అయితే 2019 మేలో అమ్మిన 2.03 లక్షల టన్నుల కంటే ఆరు శాతం ఎక్కువ.
undefined
కోవిడ్ -19 రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఉచిత సిలిండర్లను ఇవ్వడంతో ఎల్‌పిజి గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో వృద్ధిని నమోదు చేసింది.
undefined
click me!