గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పి‌జి సిలిండర్ ధర.. కొత్త ధర ఎంతంటే ?

First Published Jun 2, 2021, 1:15 PM IST

దేశంలోని ప్రధాన పెట్రోలియం కంపెనీలు ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం తగ్గించాయి. వాణిజ్య ఉపయోగం కోసం వాడే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ. 122 తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  నిర్ణయించాయి.  

నేటి (జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కు చేరింది. కానీ ప్రస్తుతం డోమస్టిక్ గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే కొనసాగుతుంది.
undefined
ముంబైలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు, కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.1544కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది.
undefined
14 కేజీల డోమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఈ నెలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో డోమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ.809, చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825 వద్ద ఉంది.
undefined
హైదరాబాద్‌లో రూ. 861.50 గా ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే మరోవైపు ఇంధన ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటాగా మరికొన్ని రాష్ట్రాల్లో రూ.100 చేరువలో ఉంది.
undefined
click me!