సామాన్యుడిని హడలేతిస్తున్న ఇంధన ధరలు.. వారిసగా 6వ రోజు కూడా పెట్రోల్ ధర పెంపు

First Published Nov 1, 2021, 2:35 PM IST

దేశవ్యాప్తంగా  వరుసగా ఆరో రోజు సోమవారం పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరలు పెరిగాయి. దీంతో ఇంధన ధరలు నేడు నవంబర్ 1వ తేదీన ఎన్నడూ లేని విధంగా  గరిష్ట స్థాయికి చేరాయి.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ‌ రోజు 35 పైసలు పెరిగి  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర  109.69కి డీజిల్ ధర రూ.98.42కి చేరాయి.

విమానయాన సంస్థలకు విక్రయించే ఆవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF లేదా జెట్ ఇంధనం)  ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 32.79 శాతం ఎక్కువగా ఉంది. ఢిల్లీలో ఏటి‌ఎఫ్ ధర  లీటరుకు దాదాపు రూ.82.6.

ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ.115.50కు, డీజిల్ ధర లీటరుకు రూ.106.62 చేరింది. చెన్నైలో పెట్రోలు ధర  లీటరు రూ.106 కంటే అధికంగా మారి ప్రస్తుతం లీటరుకు రూ.106.35 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.102.59గా ఉంది. దేశంలోని ప్రముఖ నాలుగు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయని ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ తెలిపింది. వాల్యు ఆధారిత టాక్స్ లేదా VAT కారణంగా ఇంధన ధరలు ప్రతి రాష్ట్రానికి  మారుతూ ఉంటాయి.

నగరం    పెట్రోలు    డీజిల్
ఢిల్లీ          109.69    98.42
ముంబై    115.50    106.62
చెన్నై        106.35    102.59
కోల్‌కతా     110.15    101.56

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు రిఫైనరీ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే  ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.
 

 బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 20 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి బ్యారెల్‌కు  83.52 డాలర్లకి చేరుకుంది. యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 37 సెంట్లు లేదా 0.4 శాతం పడిపోయి  83.20డాలర్లకి పడిపోయింది. గత ఏడాది కాలంలో బ్రెంట్ క్రూడ్ ధరలు 122% పెరిగాయి, ఇది భారతదేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం.

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117 దాటగా, డీజిల్ ధర రూ.108 దాటింది.అలాగే  శ్రీగంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.122కు చేరుకోగ, డీజిల్‌ ధర దాదాపు రూ.113కు చేరుకుంది.  హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 40 పైసలు పెరిగి రూ.114.12కు చేరింది. డీజిల్ ధర కూడా లీటరుకు 42 పైసలు పెరిగి రూ.107.40కు ఎగసింది.

click me!