బ్యాంక్ హాలిడేస్ లిస్ట్: నవంబర్ నెలలో బ్యాంకులు బంద్ కానున్న రోజులు ఇవే..

First Published Nov 1, 2021, 11:35 AM IST

న్యూ ఢిల్లీ: నవంబర్ నెలలో  బ్యాంకులకు భారీగా సెలవులు(holidays)  రానున్నాయి. కొన్ని దేశవ్యాప్తంగా  పండుగ సెలవుల కారణంగా  మరికొన్ని స్థానిక పండుగల కారణం ఈ సెలవులు వర్తించనున్నాయి. ఈ పండుగలు/ఉత్సవాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖలు(banks) మూతపడనున్నాయి. నవంబర్ నెలలో మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించే ముందు బ్యాంకులు మూసివేయబడే ముఖ్యమైన రోజుల జాబితాను మీరు తప్పనిసరిగా గమనించాలి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పటిలాగే పని చేస్తూనే ఉన్నప్పటికీ నవంబర్ 2021 నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు మూసివేయబడే కొన్ని రోజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ జాబితా ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 17 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో 11 రోజులు ఆర్‌బి‌ఐ క్యాలెండర్ హాలిడేస్ ఉండగ, మిగిలినవి శని, అది వారాల సెలవులు ఉన్నాయి. అయితే అన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో మొత్తంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడవని మీరు గమనించాలి. అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు, రాష్ట్రాలు పాటించే మొత్తం సెలవుల లిస్ట్. ఉదాహరణకు బీహార్‌లో ఛత్ పూజ కోసం బ్యాంకు శాఖలు మూసివేయవచ్చు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకునే వంగాలా పండుగ రోజున మూసివేయబడవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సెలవులను మూడు  క్యాటగిరిల క్రింద ఉంచుతుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడేస్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల అక్కౌంట్స్ క్లోసింగ్. అయితే, బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి అలాగే అన్ని బ్యాంకింగ్ సెలవులు వీటిని పాటించబడవు. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్యాంక్ సెలవులను మూడు  క్యాటగిరిల క్రింద ఉంచుతుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలిడే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్  హాలిడేస్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల అక్కౌంట్స్ క్లోసింగ్. అయితే, బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి అలాగే అన్ని బ్యాంకులు ఈ సెలవులను పాటించవు. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.


నవంబర్ 2021 నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా : 

కన్నడ రాజ్యోత్సవ/కుట్: నవంబర్ 1

నరక చతుర్దశి: నవంబర్ 3

దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ: నవంబర్ 4

దీపావళి (బలి ప్రతిపద)/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే/గోవర్ధన్ పూజ: నవంబర్ 5

భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్ చకౌబా: నవంబర్ 6

ఛత్ పూజ//సూర్య పష్టి దాలా ఛత్ (సాయన్ అర్ధ) : నవంబర్ 10

ఛత్ పూజ: నవంబర్ 11

వంగాల పండుగ: నవంబర్ 12

గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ: నవంబర్ 19

కనకదాస జయంతి: నవంబర్ 22

సెంగ్ కుట్స్నెమ్: నవంబర్ 23

పై బ్యాంకు సెలవులు కాకుండా నెలలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు క్రింది తేదీలలో వస్తాయి:

నవంబర్ 7 - ఆదివారం

నవంబర్ 13 - నెలలో రెండవ శనివారం

నవంబర్ 14 - ఆదివారం

నవంబర్ 21 - ఆదివారం

నవంబర్ 27 - నెలలో నాల్గవ శనివారం

నవంబర్ 28 - ఆదివారం

రాష్ట్రలు ప్రకటించిన సెలవుల ప్రకారం వివిధ ప్రాంతాలలో పైన పేర్కొన్న రోజులను సెలవులుగా గమనించాలీ, అయితే గెజిటెడ్ సెలవుల కోసం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. మీరు ఈ సెలవులను గుర్తుంచుకొని  మీరు బ్యాంక్ లావాదేవీ కార్యకలాపాలను మెరుగైన మార్గంలో ప్లాన్ చేయవచ్చు. 

click me!