దీపావళికి ముందు గ్యాస్ వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన ఎల్‌పి‌జి సిలిండర్ ధరలు..

First Published Nov 1, 2021, 2:04 PM IST

న్యూఢిల్లీ: దీపావళి పండగ(diwali festival) ముందు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (lpg) గ్యాస్ సిలిండర్‌ (gas cylinder)ధర ఈరోజు రూ.266 పెరిగింది. దీంతో వాణిజ్య సిలిండర్ల ఎల్‌పీజీ ధర సోమవారం రూ.266 అధికంగా మారింది. ఈ రోజు నుంచి పెరిగిన ధర అమల్లోకి రానుంది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర ఈరోజు నుండి రూ. 2000.50 చేరింది, అంతకుముందు రూ.1734గా ఉంది. 

అయితే పెట్రోలియం కంపెనీలు వంటింటి ఎల్‌పిజి(domestic gas)సిలిండర్‌లను పెంచకపోవడం సామాన్యులకు కాస్త ఉపశమనం లభించింది.

ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధర ఇప్పుడు రూ.1,950గా ఉంది, అంతకుముందు  ధర రూ.1,683. కోల్‌కతాలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర వరుసగా రూ. 2,073.50 ఉండగా, చెన్నైలలో రూ. 2,133గా ఉంది.

గతంలో అక్టోబర్ 6న పెట్రోలియం కంపెనీలు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్‌ల ధరను రూ. 15 పెంచాయి. ఢిల్లీలో నాన్-సబ్సిడీ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.899.50 కాగా, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ కొత్త ధర రూ.502గా ఉంది. ఎల్‌పిజి సిలిండర్ కొత్త ధర ప్రతి నెల 1 తేదీన విడుదల చేయబడుతుంది.  నివేదిక ప్రకారం ఎల్‌పిజి ధర విషయంలో తక్కువ ధరకు విక్రయించడం వల్ల వచ్చే నష్టం (అండర్ రికవరీ) సిలిండర్‌కు రూ. 100కి చేరుకుంది. ఈ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది.

పెట్రోల్, డీజిల్ ధరల లాగానే ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు సబ్సిడీతో కూడిన ఎల్‌పి‌జి ధర పెరుగుదల జనవరి 1 నుండి  సిలిండర్‌కు  రూ.205కి పెరిగింది.

ప్రభుత్వ విధానం ప్రకారం సబ్సిడీ కింద ప్రతి ఇంటికి 14.2 కిలోల  12 సిలిండర్‌లను తక్కువ మార్కెట్ ధరలకు సరఫరా చేస్తుంది. దీని కంటే ఎక్కువ సిలిండర్లను పొందవల్సి వస్తే మార్కెట్ ధర లేదా నాన్-సబ్సిడీ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

click me!