దీపావళి(diwali) సందర్భంగా కేంద్రం ఇంధనాల ధరలపై ఎక్సైజ్ సుంకం(excise duty) తగ్గింపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే, ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరపై రూ. 5, డీజిల్ ధరపై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
నేడు ఢిల్లీలో పెట్రోలు ధర రూ.103.97గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20, డీజిల్ ధర రూ.94.62గా ఉంది.