ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.47,155కి చేరుకుంది. గత ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,585 వద్ద ముగిసింది. ఎంసిఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.4% పెరిగి రూ.48,073కి చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.4% పెరిగి కిలోకు రూ.63420కి చేరాయి.
బంగారం ధర పెరగడంతో నేడు మరో వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం వెండి ధర రూ.190 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వెండి కిలో రూ.62,145కి చేరింది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో వెండి కిలో రూ.61,955 వద్ద ముగిసింది.