ఇంధన ధరల అల్ టైమ్ హై రికార్డు.. వాహనదారులకి చెమటలు పట్టిస్తున్న పెట్రోల్, డీజిల్..

First Published Oct 30, 2021, 11:41 AM IST

రెండు రోజుల విరామం తర్వాత దేశవ్యాప్తంగా  అక్టోబర్ 30న శనివారం  వరుసగా నాలుగో రోజు పెట్రోలు(petrol), డీజిల్ (diesel)ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను అనుసరించి తాజా పెరుగుదల దేశవ్యాప్తంగా ఇంధన ధరలను అత్యధిక స్థాయికి నేట్టింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 35 పైసల పెంపుతో  ఎన్నడూ లేనంతగా రూ.108.99కి చేరింది. డీజిల్ ధర కూడా 35 పైసలు  పెరుగుదలతో  లీటరుకు రూ.97.72కి చేరుకుంది.

ముంబైలో కూడా నిన్నటితో పోలిస్తే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 114.81 కాగా, డీజిల్ ధర రూ. 105.86.

కోల్‌కతా విషయానికొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.109.46 కాగా, డీజిల్ ధర రూ.100.84గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.74, డీజిల్ ధర రూ.101.92.
 

వాల్యు ఆధారిత పన్నును బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.

ఇదిలావుండగా చమురు సరఫరా, డిమాండ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం  చమురు ఎగుమతి దేశాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ ధరలలో తక్షణ ఉపశమనం కలిగించే అవకాశం లేదు.

అంతకుముందు, పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ చమురు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలకు చమురు ధర, సరఫరా, డిమాండ్ పై ఆందోళనలను లేవనెత్తింది.


భారతదేశంలో కేవలం 13 రోజుల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఇంధన ధరల పెంపును చూసింది. ఈ వారం మంగళవారం వరకు ఇంధనాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. గత నాలుగు వారాల్లో పెట్రోల్ ధర 21 సార్లు పెరిగింది, సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధర 24 సార్లు పెరిగింది. తాజా పెంపుదలతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.8 కంటే ఎక్కువ పెరిగాయి . మే 2020 నుండి పెట్రోల్ ధర లీటరుకు దాదాపు  రూ.38 పెరిగింది. డీజిల్ కూడా లీటరుకు దాదాపు రూ.29 పెరిగింది.

click me!