ఇంధన ధరల అప్ డేట్: ఎప్పటిలాగే స్థిరంగా పెట్రోల్ డీజిల్.. మీ నగరంలో ఒక లీటరు ఎంతో చెక్ చేసుకోండి..

Ashok Kumar | Published : Nov 1, 2023 10:10 AM
Google News Follow Us

కొత్త ఇంధన  ధరల నోటిఫికేషన్ ప్రకారం, ప్రముఖ  నగరాల్లో  నేడు నవంబర్ 1న పెట్రోల్,  డీజిల్ ధరలు మారలేదు అయితే ఒక సంవత్సరం పైగా  ధరలు  స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
 

14
 ఇంధన ధరల అప్ డేట్: ఎప్పటిలాగే  స్థిరంగా పెట్రోల్ డీజిల్.. మీ నగరంలో ఒక లీటరు ఎంతో చెక్ చేసుకోండి..

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్ ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.
 

ఢిల్లీలో పెట్రోల్ ధర  రూ . 96.72/లీటర్, డీజిల్ ధరలు రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్ ధర  రూ .106.31 /లీటర్‌కు, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌కు.

చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63/లీటర్, డీజిల్ ధర రూ.94.24/లీటర్. 

 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03/లీటర్, డీజిల్ ధర రూ.92.76/లీటర్. 

24

బెంగళూరు

పెట్రోలు ధర రూ.101.94/లీటరు 

డీజిల్ ధర రూ.87.94/లీటరు 

చండీగఢ్

పెట్రోలు ధర రూ.96.2/లీటరు 

డీజిల్ ధర రూ. 84.26/లీటరు 

-హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

34

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

క్రూడాయిల్  ధరలు
బుధవారం  ఆసియా ట్రేడింగ్ ప్రారంభ సమయంలో చమురు ధరలలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ప్రత్యేకంగా, బ్రెంట్ జనవరి క్రూడ్ ఫ్యూచర్స్ 36 సెంట్లు లేదా 0.4 శాతం పెరుగుదలతో 0040 GMT నాటికి బ్యారెల్‌కు US డాలర్ $85.38కి చేరుకుంది. 

US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్  28 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు US డాలర్ $81.30 వద్ద స్థిరపడ్డాయి.

Related Articles

44

ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటలకు సమీక్షిస్తారు. జూన్ 2017 నుండి భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ సవరించబడుతున్నాయి, దీనిని డైనమిక్ ఇంధన ధర పద్ధతి అంటారు.

 పెట్రోల్  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా ఉండటానికి  ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

Recommended Photos