అలర్ట్.. నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ అన్నీ మారనున్నాయి.. పూర్తి వివరాలు ఇదిగో !!

First Published | Oct 31, 2023, 5:33 PM IST

అక్టోబర్ నెల ముగుస్తుంది, నవంబర్ నెల రేపటి నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నెల ప్రారంభంలో అనేక ఆర్థిక మార్పులు జరగబోతున్నాయి, ఇవి  సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు. కొత్త నెల ప్రారంభం నుండి ఆయిల్ కంపెనీలు LPG ధరలను నిర్ణయిస్తాయి. మరి ఈ పండుగ సీజన్‌లో సామాన్యుల జేబుపై ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం...
 

ధంతేరస్, దీపావళి, భాయ్ దూజ్, సాథ్ మొదలైన వాటి కారణంగా బ్యాంకులకు నవంబర్‌లో చాలా సెలవులు రానున్నాయి. దింతో  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శని, ఆదివారాలతో సహా మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో మీకు బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈ లిస్ట్ పరిశీలించిన తర్వాత మాత్రమే మీ పనులు ప్లాన్ చేయండి. లేకపోతే, మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు.

LPG సిలిండర్ ధర

 ఎల్‌పిజి అండ్ సిఎన్‌జి ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తాయి. మరి ప్రభుత్వం ప్రజలను షాక్‌కు గురి చేసి ధరలు పెంచుతుందా.. లేక పండుగల సీజన్‌లో ధరలను నిలకడగా ఉంచుతుందా అనేది చూడాలి.

Latest Videos


ల్యాప్‌టాప్ దిగుమతులకి గడువు

HSN 8741 క్యాటగిరి కింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నవంబర్‌లో దీనికి సంబంధించిన దానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
 

BSE ఈక్విటీ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ 

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే BSE అక్టోబర్ 20, 2023న ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో  లావాదేవీల రుసుములను పెంచబోతున్నట్లు పేర్కొంటూ పెద్ద ప్రకటన చేసింది. ఈ ఛార్జీలు S&P BSE సెన్సెక్స్ అప్షన్స్ పై విధించబడతాయి, ఇవి రిటైల్ పెట్టుబడిదారులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

click me!