petrol diesel prices today:నేడు స్థిరంగా ఇంధన ధరలు.. ఇప్పుడు లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే ?

First Published Nov 15, 2021, 11:41 AM IST

 నేడు వరుసగా పన్నెండవ రోజు కూడా అంటే నవంబర్ 15 సోమవారం  పెట్రోల్(petrol), డీజిల్(diesel) ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీపావళి(diwali) సందర్భంగా ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం (excise duty)తగ్గింపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా తార స్థాయికి చేరాయి.

ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో పెట్రోలు ధరపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి  దేశంలోని పలు రాష్ట్రాలు  కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను (VAT)ని తగ్గించాయి.

అంతేకాకుండా రెండు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పెట్రో ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల జాబితాల ప్రకారం ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గింపు ప్రభావంతో పంజాబ్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 16.02, డీజిల్ ధర లీటరుకు రూ. 19.61 తగ్గింది. రాష్ట్రంలో పెట్రోల్‌పై వ్యాట్‌ను రూ.11.02 తగ్గించగా, డీజిల్‌పై రూ.6.77 తగ్గింది. లడఖ్‌లో, డీజిల్‌పై అత్యధికంగా లీటరుకు రూ. 9.52 తగ్గింది. ఎక్సైజ్ డ్యూటీలో లీటర్‌పై రూ. 10 పైగా వ్యాట్‌  కోత విధించడమే దీనికి కారణం.

కేంద్రం పన్ను తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.97కి చేరింది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.98గా ఉంది. కోల్‌కతాలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉంది. చెన్నైలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉంది.

 ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎలాంటి వ్యాట్ తగ్గింపును ప్రకటించలేదు. కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధర రూ.89.79గా, చెన్నైలో డీజిల్ ధర లీటరుకు రూ.91.43గా ఉండగా, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లీటర్ డీజిల్ ధర రూ.90.87గా ఉంది.

అదనపు వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు/యూటీలు లడఖ్, కర్ణాటక, పుదుచ్చేరి, జమ్మూ & కాశ్మీర్, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డామన్ & డయ్యూ, దాద్రా & నాగ్ర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ & నికోబార్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా ఉన్నాయి.
 

ఇప్పటివరకు వ్యాట్ తగ్గించని రాష్ట్రాల్లో  రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, టీఆర్‌ఎస్ నేతృత్వంలోని తెలంగాణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలిత ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

ముంబై :పెట్రోలు - లీటరుకు రూ.109.98
డీజిల్ - లీటరుకు రూ.94.14

ఢిల్లీ: పెట్రోలు - లీటరుకు రూ.103.97
డీజిల్ - లీటరుకు రూ.86.67

చెన్నై: పెట్రోలు - లీటరుకు రూ.101.40
డీజిల్ - లీటరుకు రూ.86.67

కోల్‌కతా: పెట్రోలు - లీటరుకు రూ.104.67
డీజిల్ - లీటరుకు రూ.89.79

భోపాల్ : పెట్రోలు - లీటరుకు రూ.107.23
డీజిల్ - లీటరుకు రూ.90.87

హైదరాబాద్ : పెట్రోలు - లీటరు రూ.108.20
డీజిల్ - లీటరుకు రూ.94.62

బెంగళూరు: పెట్రోలు - లీటరు రూ.100.58
డీజిల్ - లీటరుకు రూ.85.01

చండీగఢ్ : పెట్రోలు - లీటరుకు రూ.100.12
డీజిల్ - లీటరుకు రూ.86.46

గౌహతి: పెట్రోలు - లీటరు రూ.94.58
డీజిల్ - లీటరుకు రూ.81.29

లక్నో: పెట్రోలు - లీటరు రూ.95.28
డీజిల్ - లీటరుకు రూ.86.80

గాంధీనగర్ : పెట్రోలు - లీటరు రూ.95.35
డీజిల్ - లీటరుకు రూ.89.33

తిరువనంతపురం: పెట్రోలు - లీటరుకు రూ.106.36
డీజిల్ - లీటరుకు రూ.93.47

click me!