సామాన్యులపై ఇంధన ధరల పిడిగు.. కొనలేని స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరల పరుగు..

First Published Oct 1, 2021, 3:17 PM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ధరల కారణంగా అక్టోబర్ 1 శుక్రవారం ఇంధన ధరలను దేశీయ చమురు సంస్థలు  మళ్లీ  సవరించాయి. దీంతో పెట్రోల్ ధర 22 నుండి 30 పైసలు,  డీజిల్ ధర లీటర్‌కు 29 నుండి 32 పైసలు పెరిగింది. తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో అధిక ధరకు చేరాయి.

 సెప్టెంబర్ నెలలో ఇంధన ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. చెన్నై నగరంలో కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధర సుమారు రూ .3  తగ్గించిన సంగతి మీకు తెలిసిందే.

ముంబై నగరంలో పెట్రోల్ ధర తాజా  24 పైసల  పెంపు  తర్వాత శుక్రవారం లీటరుకు రూ. 107.95గా ఉంది.  దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో పెట్రోల్ ధర లీటరుకు 25 పైసలు పెంపుతో రూ. 101.89 గా ఉంది. అదేవిధంగా, చెన్నైలో కూడా పెట్రోల్ ధర పెరిగింది, ఇప్పుడు వాహనదారులు లీటరు పెట్రోల్‌కు 22 పైసలు పెంపుతో రూ .99.58 చెల్లించాల్సి ఉంటుంది. కోల్‌కతాలో  30 పైసలు పెరగగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 102.47, బెంగళూరులో  పెట్రోల్ ధర  27 పైసలు పెరగగా రూ. 105.44 గా ఉంది.  

డీజిల్ ధరల విషయానికి వస్తే ముంబైలో వాహనదారులు లీటర్ డీజిల్‌కు  32 పైసలు పెంపుతో రూ. 97.84 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో డీజిల్ ధర 30 పైసలు పంపుతో రూ .90.17గా ఉంది.
చెన్నైలో లీటర్ డీజిల్‌ ధర 29 పైసలు పెంపుతో  రూ. 94.74గా ఉంది. కోల్‌కతాలో డీజిల్ ధర లీటరుకు 30 పైసలు పెంపుతో రూ. 93.27గా ఉంది. బెంగళూరు నగరంలో ఒక లీటర్ డీజిల్ ధర రూ 32 పైసలు పెంపుతో రూ.95.70గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 98.39గా ఉంది.

జాతీయ, అంతర్జాతీయంగా కారకాల ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారు. పెట్రోల్ లేదా డీజిల్ రిటైల్ ధర విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, కేంద్ర ప్రభుత్వ పన్నులను కలిపి ఉంటాయి. ఇందులో ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు విధించే ఛార్జీలు కూడా  ఉంటాయి. 

 శుక్రవారం బ్రెంట్ ఫ్యూచర్స్ 12 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయాయి బ్యారెల్‌కు $ 78.52 గా ఉంది. మరోవైపు యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ 20 సెంట్లు లేదా 0.3 శాతం పెరిగి 75.03 డాలర్లకు చేరుకుందని ఒక నివేదిక తెలిపింది.
 

ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది. 
 
మీ నగరంలో
పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి  మీరు ఎస్‌ఎం‌ఎస్‌ఎం కూడా చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి, మీ నగర కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది. లేదా ఇక్కడ చెక్ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

click me!