ఉచిత ఎల్‌పి‌జి గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా అప్లయ్ చేసుకోండీ..

First Published Oct 1, 2021, 12:51 PM IST

సాధారణంగా ప్రజలు ఎల్‌పి‌జి గ్యాస్ కనెక్షన్ పొందడానికి 5 నుండి 6  వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ మీకు ఈ కనెక్షన్ ఉచితంగా లభిస్తే... అవును, ఇప్పుడు ప్రభుత్వం ఒక గొప్ప పథకం కింద ప్రజలకు ఉచిత ఎల్‌పి‌జి గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. 

 1 మే  2016న గ్రామీణ భారతాన్ని పొగరహితంగా మార్చడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సామాజిక సంక్షేమ పథకం ప్రారంభించారు. ఉజ్వల పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడుతుంది. ఈ పథకం లబ్ధిదారులకు మొదటి రీఫిల్‌ను ఉచితంగా అందించడంతో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అందిస్తుంది. మీరు కూడా ఈ ప్రభుత్వ  పథకం సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కేవలం ఇంట్లో కూర్చుని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం పూర్తి ప్రక్రియ ఏమిటో తెలుసుకోండి..?

ఉజ్వల యోజన ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చు?

ఈ ఉజ్వల పథకం ప్రయోజనాన్ని మహిళలు మాత్రమే పొందవచ్చు. 
దారిద్య్రరేఖకు దిగువన నివసించే వారు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలరు. 
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, దరఖాస్తు చేసుకున్న మహిళ వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 
ఈ పథకం కింద ఇంట్లో వేరే ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. 
 

ఉజ్జ్వల యోజన పథకం ప్రయోజనాన్ని పొందడానికి కావల్సిన  డాక్యుమెంట్స్ 
బి‌పి‌ఎల్(below poverty line) రేషన్ కార్డ్
సర్పంచ్ / మునిసిపాలిటీ ప్రెసిడెంట్ ద్వారా అధికారం పొందిన బి‌పి‌‌ఎల్ సర్టిఫికేట్ 
ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు)
పాస్‌పోర్ట్ సైజు ఫోటో 
పేరు, అడ్రస్ ప్రూవ్, జన్ ధన్/బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ మొదలైన ప్రాథమిక వివరాలు. 
సబ్సిడీ మొత్తాన్ని పొందడానికి మహిళా దరఖాస్తుదారు పేరుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండాలి. 
 

గ్యాస్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా మీరు ఉజ్జ్వాలా యోజన www.pmuy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
ఇక్కడ మీరు మూడు ఆప్షన్స్ చూస్తారు 1. indane gas,భారత్ గ్యాస్, హెచ్‌పి (HP)గ్యాస్ . 
మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకుని, ఆపై కొత్త కనెక్షన్ కోసం అడిగిన సమాచారాన్ని నింపి సమర్పించవచ్చు. 
మీకు కావాలంటే  ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోని  వివరాలు నింపి మీ సమీప గ్యాస్ ఏజెన్సీ డీలర్‌కు సమర్పించవచ్చు. 
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, మీకు  కొత్త గ్యాస్ కనెక్షన్ అందించబడుతుంది. 

మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ శాశ్వత నివాస ధృవీకరణ పత్రం అనగా అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా మీరు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. 
 

click me!