ఎట్టకేలకు టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా.. 6 దశాబ్ధాల తరువాత మళ్ళీ ..

Ashok Kumar   | Asianet News
Published : Oct 01, 2021, 02:14 PM ISTUpdated : Oct 01, 2021, 02:16 PM IST

నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కోసం బిడ్ ను టాటా సన్స్ గెలుచుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఇప్పుడు ఎయిర్ ఇండియాకి కొత్త యజమాని టాటా గ్రూప్ అవుతుంది. విమానయాన సంస్థను చేపట్టే ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించిందని ఒక నివేదికలో పేర్కొంది. రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

PREV
16
ఎట్టకేలకు టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా..  6 దశాబ్ధాల తరువాత మళ్ళీ ..
1932 లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో ప్రారంభం

టాటాతో ప్రభుత్వ ఒప్పందం జరిగిన తర్వాత 68 సంవత్సరాలకు ఈ ఎయిర్‌లైన్  మళ్ళీ టాటా చేతికి వచ్చింది. టాటా గ్రూప్ 1932 అక్టోబర్‌లో టాటా ఎయిర్‌లైన్స్  ప్రారంభించారు తరువాత 1946లో ఎయిర్‌ ఇండియా పేరు మార్చారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ విమానయాన సంస్థ అవసరం ఏర్పడింది. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 49 శాతం వాటాలను కొనుగోలు చేసింది. దీని తరువాత 1953లో భారత ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. తరువాత కంపెనీలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్ నుండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ కాస్తా ప్రభుత్వ ఎయిర్‌ ఇండియాగా మారింది. 

26
విమాన సంస్థకి వేల కోట్ల అప్పులు

 మార్చి 31, 2019 నాటికి ఎయిర్ ఇండియా కంపెనీకి రూ.60074 కోట్ల రుణం ఉంది. మార్చి 2021తో ముగిసిన త్రైమాసికానికి కంపెనీకి రూ .9,500 నుండి రూ .10,000 కోట్ల వరకు నష్టపోతుందని అంచనా. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే కంపెనీ రూ .23,286.5 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రుణాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తారు. దీని అర్థం మిగిలిన రుణాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

36


విదేశాలకు నడిపే విమానాలు ఎయిర్‌ ఇండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.
 

46

ప్రస్తుతం, ఎయిర్ ఇండియా 4400 దేశీయ విమానాల ఒప్పందంలో ముంబైలోని ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం, ఢిల్లీలోని ఎయిర్‌లైన్స్ హౌస్ ఉన్నాయి. ముంబై కార్యాలయం మార్కెట్ విలువ రూ.1500 కోట్లకు పైగా ఉంది. అలాగే ఎయిర్ ఇండియా 4400 దేశీయ విమానాలతో పాటు విదేశాలలో 1800 ల్యాండింగ్ అండ్ పార్కింగ్ స్లాట్‌లను నియంత్రిస్తుంది.

56
టాటా బిడ్ రిజర్వ్ ధర కంటే దాదాపు రూ .3,000 కోట్లు ఎక్కువ

 ఒక నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ బిడ్ ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే దాదాపు రూ .3,000 కోట్లు ఎక్కువ. టాటా బిడ్ స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ వేసిన దాని కంటే దాదాపు రూ.5,000 వేల కోట్లు ఎక్కువ.  

66
ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ

ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ జనవరి 2020లోనే ప్రారంభమైంది, కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. ఏప్రిల్ 2021లో ప్రభుత్వం మరోసారి అర్హత కలిగిన కంపెనీలను బిడ్ వేయమని కోరింది. బిడ్డింగ్ కొరకు చివరి రోజు సెప్టెంబర్ 15 కాగా 2020 సంవత్సరంలో కూడా టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి లేఖను ఇచ్చింది. ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ (EOL) నిబంధనలను సడలించిన తరువాత కొన్ని కంపెనీలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. కొత్త నిబంధనల ప్రకారం రుణల నిబంధనలు సడలించాయి, తద్వారా యాజమాన్యం అంటే టాటా గ్రూప్ ఇప్పుడు ఎయిర్ ఇండియా మొత్తం రుణాన్ని భరించాల్సిన అవసరం లేదు.

click me!

Recommended Stories