పెట్రోల్, డీజిల్ తాజా ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Nov 25, 2021, 12:55 PM IST

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు(fuel prices) ఆకాశానికి తాకడంతో కేంద్రం ఈ నెల దీపావళి(diwali) పండగ ముందు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్  సుంకన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. ఒకవైపు ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వాహనదారులకు కాస్త ఊరట లభించిన ఎప్పటికీ కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర సెంచరీకి పైగానే ఉంది. 

PREV
14
పెట్రోల్, డీజిల్ తాజా ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

 గత 21 రోజుల నుండి ప్రభుత్వ ఆయిల్ కంపెనీల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత రెండు వారాల్లో సామాన్యులకు ఊరటనిస్తూ చమురు ధరలు భారీగా పడిపోయాయి. గతంలో పలు రాష్ట్రాల్లో డీజిల్ ధర రూ.100కు పైగా చేరగా దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

24

ఢిల్లీలో పెట్రోలు ధర రూ.103.97గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది.

34

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. IndianOil వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249కి పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది, దీనిని IOCL వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

ఇక్కడ క్లిక్  చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

44

పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పరిమితుల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.  

click me!

Recommended Stories