ముఖేష్ అంబానికి పోటీగా గౌతమ్ ఆదాని.. ఆస్తుల పరంగా వారిద్దరి సంపద ఎంతంటే ?

First Published Nov 25, 2021, 11:44 AM IST

ఆదాని గ్రూప్(adani group) చైర్మన్ గౌతమ్ అదానీ (goutham adani)సంపద ఈ ఏడాది అంటే 2021లో భారీగా పెరిగింది. ఏంటంటే ఇప్పుడు అదానీ ఆస్తుల విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(mukesh ambani)తో సమానంగా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి సంపద 89 బిలియన్ డాలర్లు అంటే రూ.6.63 లక్షల కోట్లు. 

ఇప్పటి వరకు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన  ముఖేష్ అంబానీ ఇప్పుడు ఈ స్థానంలో గౌతమ్ ఆదాని సమానంగా నిలిచాడు.

అదానీ కంపెనీల క్యాపిటలైజేషన్ 10 లక్షల కోట్లు 
ఒక నివేదిక ప్రకారం బుధవారం నాటికి అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లు. అయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికీ అదానీ గ్రూప్ కంటే ముందంజలో ఉన్నప్పటికీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో అంబానీ కంటే సొంత కంపెనీల్లో గౌతమ్ అదానీ వాటా ఎక్కువ.
 

గ్రూప్ కంపెనీల వాటా గురించి మాట్లాడితే కంపెనీలలో అదానీకి 71 శాతం వాటా , అదానీ గ్రూప్ కంపెనీలలో గౌతమ్ అదానీ వాటా 70.59 శాతం. అదానీకి మూడు కంపెనీల్లో 74.92 శాతం, ఒక కంపెనీలో 74.80 శాతం వాటా ఉంది. దీనితో పోలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ వాటా 50.61 శాతం. మరోవైపు, కార్పొరేషన్ ఆస్తుల నుండి బాధ్యతలను తీసివేసిన తర్వాత ఇప్పుడు నికర విలువ పరంగా ఇద్దరివి సమానంగా ఉన్నాయి.

బుధవారం అంబానీ స్థాయికి అదానీ 
విశేషమేమిటంటే, బుధవారం అదానీ గ్రూప్ కంపెనీలు గ్రాస్ మార్కెట్ క్యాప్‌లో రూ.12,000 కోట్లు, నెట్ మార్కెట్ క్యాప్‌లో రూ.4,250 కోట్లు పెరిగాయి. బుధవారం స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు 2.76 శాతం లాభంతో రూ.1754.65 వద్ద ముగిసింది. ఈ కారణంగా అతని సంపద పెరిగిన తర్వాత గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీతో సమానంగా చేరుకున్నారు. 
 

రిలయన్స్ షేర్లలో పతనం
బుధవారం రిలయన్స్ షేర్లలో పతనం నమోదైంది. సౌదీ అరామ్‌కోతో 15 బిలియన్ల డాలర్ల డీల్ బ్రేక్ అయినప్పటి నుండి రిలయన్స్ షేర్లు స్థిరంగా క్షీణించాయి. బుధవారం రిలయన్స్ షేరు బీఎస్‌ఈలో 1.48 శాతం క్షీణించి రూ.2,350.90 వద్ద ముగిసింది. షేర్ ధర పతనం కారణంగా అంబానీకి దాదాపు రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లింది.

click me!