Petrol Diesel Price today:సెంచరీకి పైనే కొనసాగుతున్న పెట్రోల్ ధరలు.. నేడు తాజాగా ధరలు తెలుసుకోండి..

First Published Dec 17, 2021, 11:56 AM IST

నేడు వరుస 16వ రోజు కూడా ఇంధన ధరల(fuel prices)ను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు (oil companies)ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు(petrol) ధరలు ఇప్పటికీ రూ.100 పైగానే కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా దేశంలో పెట్రోలు, డీజిల్ (diesel)ధరలు ఇప్పటికీ సామాన్యుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

నేటికీ ఇంధన ధరలో ఎలాంటి మార్పు లేనప్పటికి  కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది.


ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్‌లలో పెట్రోల్ ధర రూ. 100 పైగా  ఉంది. అయితే  ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.
 

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. 

మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. IndianOil వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది, దీనిని మీరు IOCL వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.
 

ఒక్కో నగరంలో వేర్వేరు ధరలు ఎందుకు?
ప్రతి నగరంలో పెట్రోల్ ధర మారడానికి పన్ను ముఖ్య కారణం. వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పన్ను వసూలు చేస్తాయి. ప్రతి నగరం ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పన్నులు కూడా ఉన్నాయి. అలాగే నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది, దీనిని స్థానిక సంస్థల పన్ను(local body tax) అని కూడా అంటారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధారంగా వేర్వేరు పన్నులు విధించబడతాయని గమనించండి. 

కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాల పన్ను 
డీజిల్‌పై 54 శాతం,పెట్రోల్ ధరలో 60 శాతం సెంట్రల్ ఎక్సైజ్ అండ్ రాష్ట్ర పన్ను ఉంటుంది. పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 32.90 కాగా, డీజిల్‌పై రూ. 31.80. పెట్రోలు-డీజిల్ ధరలు సాధారణంగా ప్రతిరోజూ మారుతాయి, ఈ ధరలు బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ముడి ధరలు, విదేశీ మారకపు ధరల ఆధారంగా నిర్ణయించబడతాయి.
 

click me!