ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 6 మహిళలకు చోటు.. ఎప్పటిలాగే ముకేష్ అంబానీ మళ్ళీ టాప్..

First Published Oct 7, 2021, 3:15 PM IST

న్యూఢిల్లీ:   ఫోర్బ్స్  అత్యంత ధనవంతుల జాబితాలో భారతదేశంలోని ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఓ‌పి జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ 18 బిలియన్ డాలర్ల (దాదాపు  రూ.13.46 లక్షల కోట్లు) సంపదతో ఈ జాబితాలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. గత సంవత్సరంలో ఆమే సంపద  13 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.72 లక్షల కోట్లు).
 

తరువాత 71 ఏళ్ల సావిత్రి జిందాల్ ఫోర్బ్స్ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది. ఈ జాబితాలో రెండవ అత్యంత ధనిక మహిళా పారిశ్రామికవేత్త హావెల్స్ ఇండియాకు చెందిన 76 ఏళ్ల వినోద్ రాయ్ గుప్తా. ఈమె 24వ స్థానంలో ఉంది. ఆమె సంపద ఈ సంవత్సరం రెట్టింపు కాగా 7.6 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ .5.68 లక్షల కోట్లు) చేరింది. తర్వాతి స్థానం ముంబైలో ఉన్న ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ మేజర్ యూ‌ఎస్‌వి ప్రైవేట్ లిమిటెడ్  లీనా తివారీ (43) ఉన్నారు. ఆమె మొత్తం ర్యాంక్ 43 అలాగే ఆమె నికర విలువ 4.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3.28 లక్షల కోట్లు). 

 ఈ జాబితాలో 47 ర్యాంక్‌తో తదుపరి మహిళా పారిశ్రామికవేత్తగా  బైజు సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ (35) ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడడంతో పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ టీచింగ్ లోకి మారిన తరువాత బైజు వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా పెరిగాయి. శ్రీమతి గోకుల్‌నాథ్ సంపద గత సంవత్సరంలో 1 బిలియన్ (దాదాపు రూ. 7,477 కోట్లు) పెరిగి 4.05 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.02 లక్షల కోట్లు) పెరిగింది.

బయోకాన్ కిరణ్ మజుందార్-షా(68) ఐదవ స్థానంలో ఉన్నారు. ఆమె 53వ ర్యాంకు సాధించినప్పటికీ ఆమె సంపద గత ఏడాదిలో తగ్గింది. ఆమె 2020లో   4.6 బిలియన్ (దాదాపు రూ.3.43 లక్షల కోట్లు) డాలర్లు కలిగి ఉంది, కానీ ఈ సంవత్సరం ఆమె నికర విలువ  3.9 బిలియన్ల డాలర్లకు (దాదాపు రూ. 2.91 లక్షల కోట్లు) క్షీణించింది .
 

తర్వాతి స్థానంలో ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (TAFE) అధినేత అమల్‌గామేషన్స్ కుటుంబానికి చెందిన మల్లికా శ్రీనివాసన్ ఉన్నారు. ఆమె నికర విలువ 2.89 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.16 లక్షల కోట్లు). ఈ జాబితాలో ఆమె 73వ స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్ ఇండియా ప్రతి సంవత్సరం భారతదేశంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల జాబితాను రూపొందిస్తుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 14వ సంవత్సరంలో అత్యంత సంపన్న భారతీయుడిగా ఉన్నారు. 2021లో అతని నికర విలువకు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) జోడించారు. కరోనా మహమ్మారి రెండవ సంవత్సరంలో దేశంలోని అత్యంత ధనవంతుల సంపదను 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్ తాజా నివేదికలో పేర్కొంది .

click me!