ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ లో ముకేష్ అంబానీ సెన్సేషన్.. వరుసగా 14 వ సారి కూడా

First Published Oct 7, 2021, 4:04 PM IST

 భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ నేడు విడుదల చేసింది. 2021 లో రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 14వ సంవత్సరం కూడా భారతదేశపు అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అతను 2008 నుండి అత్యంత ధనవంతుల జాబితాలో ఆగ్రా స్థానంలో కొనసాగుతున్నాడు. 

అతని సంపద 2021లో 4 బిలియన్ డాలర్లు పెరిగి 92.7 బిలియన్ డాలర్లకు చేరింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ   74.8 బిలియన్లు డాలర్లు, అంటే ముఖేష్ అంబానీ కంటే కేవలం 17.9 బిలియన్ డాలర్లు తక్కువ. 
 

భారతదేశంలోని కుటుంబం, స్టాక్ మార్కెట్, విశ్లేషకులు, నియంత్రణ సంస్థల నుండి షేర్‌హోల్డింగ్, ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ ఫోర్బ్స్ జాబితా రూపొందించారు. భారతదేశ ధనవంతుల సంపద కరోనా మహమ్మారి రెండవ సంవత్సరంలో 50 శాతం పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం, భారతదేశంలోని 100 మంది ధనవంతుల సంపద 775 బిలియన్ డాలర్లు. 

10 మంది అత్యంత సంపన్న భారతీయుల జాబితాను చూద్దాం.
1.ఈ జాబితాలో శివ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. శివ నాడార్ హెచ్‌సి‌ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అండ్ చైర్మన్.  
2.66 ఏళ్ల అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు చెందిన రాధాకిషన్ దమానీ 29.4 బిలియన్ డాలర్ల సంపదతో భారతదేశంలో నాల్గవ ధనవంతుడిగ ఉన్నారు. 
3.ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనవల్లా ఐదవ స్థానంలో ఉన్నారు. అతని నికర విలువ 19 బిలియన్ డాలర్లు.
4.లక్ష్మి మిట్టల్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. 71 ఏళ్ల లక్ష్మి మిట్టల్ భారతదేశంలో ఆరవ ధనవంతురాలు. ఆర్సెలర్ మిట్టల్ సీఈవో లక్ష్మీ మిట్టల్ 18.8 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. 
5.ఓ‌పి జిందాల్ గ్రూప్  సావిత్రి జిందాల్ మళ్లీ టాప్ 10 ధనవంతుల జాబితాలో నిలిచారు. సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఏడవ స్థానంలో ఉన్నారు ఆమె మొత్తం సంపద 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. 
6.కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉదయ్ కోటక్ నికర విలువ 16.5 బిలియన్ డాలర్లు ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడు. ఉదయ్ కోటక్ వయస్సు 62 సంవత్సరాలు.
7.తొమ్మిదవ స్థానంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ ఉన్నారు. 92 ఏళ్ల మిస్త్రీ నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు.
8.ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ బిర్లా ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం నికర విలువ  15.8 బిలియన్ డాలర్లు.

ఈ జాబితాలో 6 కొత్త వారు 
  ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో 6 కొత్తగా చేరారు వీరిలో 
1. అశోక్ బూబ్ (స్థానం - 93, ఆస్తులు - 2.3 బిలియన్ డాలర్లు) 
2.దీపక్ నైట్రైట్  దీపక్ మెహతా (స్థానం- 97, ఆస్తులు- 2.05 బిలియన్ డాలర్లు)
3.ఆల్కైల్ అమైన్ కెమికల్స్  యోగేష్ కొఠారి (స్థానం - 100, ఆస్తులు - 1.94 బిలియన్ డాలర్లు)
4. డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరవింద్ లాల్ (స్థానం- 87, ఆస్తులు-  2.55 బిలియన్ డాలర్లు)
5.రాజకీయవేత్త మంగళ్ ప్రభాత్ లోధా (స్థానం- 42, ఆస్తులు-  4.5 బిలియన్ డాలర్లు)
6. హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్  ప్రతాప్ రెడ్డి (స్థానం- 88, ఆస్తులు-  2.53 బిలియన్లు డాలర్లు)
 

click me!