అమెరికా, చైనా టారీఫ్స్ వార్ ఎఫెక్ట్ :
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధ వాతావరణం నెలకొంది., దీంతో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం ఆర్థిక మార్కెట్లపై పడింది... చమురు ఆధారిత స్టాక్స్ భారీగా నష్టపోయాయి.
ఇవాళ సోమవారం అంటే ఏప్రిల్ 7న ప్రధాన భారతీయ చమురు సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.6%, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 4.4%,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 6.1% షేర్లు పడిపోయాయి. ఈ కంపెనీలు చముర అన్వేషణ, ఉత్పత్తిలో ఎక్కువగా పాల్గొంటాయి. ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల ఆయిల్ కంపనీల ఆదాయం, లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCలు) కూడా నష్టం వాటిల్లింది. BPCL 0.21% పెరిగింది. అయితే IOC మరియు HPCL వరుసగా 2.38% మరియు 2.04% తగ్గాయి. విమానయానం, పెయింట్ మరియు టైర్ స్టాక్‌లు కూడా పడిపోయాయి. ఈ నష్టాల కారణంగా BSE సెన్సెక్స్ 4.37% పడిపోయి మధ్యాహ్నం 72,069.94 వద్ద ఉంది. ఇది పెట్టుబడిదారుల ఆందోళనను తెలియజేస్తుంది.