యాపిల్ ఐఫోన్స్ ధరలు పెరుగుతాయా?
అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ కంపనీలపైనే కాదు యాపిల్ వంటి స్వదేశీ కంపనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుంకాల పెంపు నిర్ణయంతో యాపిల్ ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పట్లో ధరలపెంపు ఉండదని యాపిల్ సంస్థ చెబుతోంది.
ప్రస్తుతం ధరల పెరుగుదలను నివారించడానికే యాపిల్ సంస్థ విదేశాల్లోని యూనిట్స్ లో తయారయ్యే వస్తువులను స్వదేశానికి చేరవేస్తోంది. దిగుమతి సుంకాలు అమలయ్యే లోపు వీలైనన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ అమెరికాకు తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఉపయోగిస్తోంది. ఇలా యాపిల్ లోడ్స్ భారత్, చైనా నుండి గాల్లో ఎగురుతున్నాయి. ఇలా తరలిస్తున్న ప్రోడక్ట్స్ ను నిల్వ చేయడానికి గిడ్డంగులను ఉపయోగిస్తున్నారు.
ఏప్రిల్ 9వ తేదీకి ముందు షిప్ చేయబడిన ఉత్పత్తులకు పాత పన్ను వర్తిస్తాయి... కాబట్టి ప్రస్తుతానికి కొత్త పన్నుల నుండి తప్పించుకోవచ్చని యాపిల్ కంపెనీ భావిస్తోంది. కానీ ఇకపై విదేశాల్లో తయారయ్యే యాపిల్ ఉత్పత్తులపై భారీ సుంకాలు పడనున్నాయి. కాబట్టి ఇప్పుడు కాకున్నా తర్వాతైనా యాపిల్ ఐపోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.