ఈ కామర్స్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. కేవలం వస్తువుల డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోకి కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే దిశగా అడుగు వేసింది.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పింక్‌విల్లా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా కంపెనీ కంటెంట్ రంగంలో తన ప్రాధాన్యతను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా Gen Z, మిల్లేనియల్ ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ అడుగులు వేస్తోంది.
25
ట్రెండ్ ఇన్‌సైట్స్, కామర్స్ అవకాశాలు
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం, ఈ కొనుగోలు ద్వారా ట్రెండ్స్‌పై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. సినిమాలు, సెలబ్రిటీలు వినియోగదారుల అలవాట్లపై ప్రభావం చూపుతున్న తరుణంలో, ఇన్ఫోటైన్‌మెంట్ కంటెంట్‌ను వాణిజ్య అవకాశాలుగా మార్చుకోవడం సంస్థ లక్ష్యంగా పనిచేస్తోంది.
35
Gen Zతో అనుబంధం కోసమే
ఫ్లిప్‌కార్ట్ కార్పొరేట్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీ అయ్యర్ మాట్లాడుతూ, “పింక్‌విల్లాలో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం Gen Zతో బలమైన అనుబంధం ఏర్పరచుకోవడానికి కీలక అడుగు. పింక్‌విల్లా కంటెంట్ శక్తి, ప్రేక్షకులతో ఉన్న అనుబంధం ఫ్లిప్‌కార్ట్ వృద్ధికి వేగం ఇస్తుంది” అన్నారు.
పింక్‌విల్లా స్థాపకురాలుచ సీఈఓ నందిని షెనోయ్ మాట్లాడుతూ, “ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడి మా కంటెంట్ శక్తికి నిదర్శనం. దీని సహాయంతో మరింత విస్తరించి, మా మిలియన్ల మంది యూజర్లకు నాణ్యమైన కంటెంట్ అందించగలము” అని చెప్పారు.
55
అమెజాన్‌తో పోటీ
ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం వెనుక మరో ముఖ్య కారణం అమెజాన్ ప్రభావం. ఇప్పటికే అమెజాన్ తన ప్రైమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంటెంట్ రంగంలో బలంగా ఉంది. దానికి ప్రతిస్పందనగా, ఫ్లిప్‌కార్ట్ పింక్‌విల్లా కొనుగోలు చేసి, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.