తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతోన్న ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఉత్తర భారత దేశానికే పరిమితమైన ఈ వ్యాపారాన్ని ప్రస్తుతం తెలుగు వారు కూడ అందిపుచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటనేగా.? అదే ముత్యాల సాగు. ప్రస్తుతం మార్కెట్లో ముత్యాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే వీటి ఉత్పత్తి మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఆర్టిఫిషియల్‌గా తయారు చేసేవి కాకపోవడం, జువెలరీ రంగంలో వీటికి అధికంగా డిమాండ్ ఉండడంతో ముత్యాల సాగు చేసే వారు కళ్లు చెదిరే లాభాలను ఆర్జిస్తున్నారు.
సహజంగా ముత్యాలు ఆయిస్టర్ల నుంచి ఉత్పత్తి అవుతాయనే విషయం తెలిసిందే. ఇవి సరస్సుల్లో, నదుల్లో సహజంగా ఉత్పత్తి అవుతుంటాయి. అయితే వీటిని ఇంట్లోనే పెంచుతున్నారు. ఇందుకోసం మొదట నీటి కొలనులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మేడపై ఖాళీ స్థలం ఉండే వారు ఇలాంటి నీటి కొలనులను నిర్మించుకోవచ్చు. ప్రారంభ దశలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నా సరిపోతుంది. అయితే వీటిలో స్వచ్ఛమైన నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ఇక ముత్యాల సాగు కోసం ఆయిస్టర్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక్కో ఆయిస్టర్ ధర రూ. 15 నుంచి రూ. 25 వరకు ఉంటున్నాయి. ఒక్కో ఆయిస్టర్ నుంచి కేవలం ఒక ముత్యం మాత్రమే లభిస్తుంది. ఆయిస్టర్లను ఆల్చిప్పలుగా కూడా పిలుస్తుంటారు. చెరువు నీటిలో ఉండే నాచును వీటికి ఆహారంగా వేయాల్సి ఉంటుంది. ఇవి తినే ఆల్చిప్ప పెరగుతుంది. నీటిలో నాచు పెరగడానికి మార్కెట్లో ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఆల్చిప్పల విషయానికొస్తే ఒక్కో దాని ధర రూ. 15 నుంచి రూ. 25 వరకు ఉంటాయి. ముత్యాల తయారీలో మరో కీలక ఘట్టం ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. ఆల్చిప్పల మధ్య మనం ఉంచే దాని బట్టే ముత్యం ఆకారం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు దేవతల రూపం, బియ్యం గింజ, గుండ్రటి ఆకారం ఇలా రకరకాల ఆకారాల్లో ముత్యాలు తయారవుతాయి.
ఒక ముత్యం తయారవ్వడానికి సుమారు 15 నుంచి 20 నెలలు పడుతుంది. లాభాల విసయానికొస్తే మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో ముత్యం ధర నాణ్యతను బట్టి రూ. 400 నుంచి రూ. 1500 వరకు కూడా ఉన్నాయి. మీరు ఉపయోగించిన నీరు, నాచు నాణ్యత ఆధారంగా ముత్యం విలువ మారుతుంది. కొన్ని ప్రత్యేకమైన ముత్యాలు ఏకంగా రూ. 10 వేల వరకు కూడా పులకుతాయి. ఇక ఒక్కో ముత్యాన్ని తక్కువలో తక్కువగా రూ. 500 చొప్పున అమ్ముడుపోతాయి. ఒక లక్ష రూపాయల పెట్టుబడితో ముత్యాల సాగు చిన్నగా ప్రారంభించుకోవచ్చు. ఆ తర్వాత మీ మార్కెటింగ్, ఉత్పత్తి బట్టి లాభాలు ఆధారపడి ఉంటాయి ఎంతో మంది ముత్యాల సాగులో శిక్షణ సైతం అందిస్తున్నారు. అలాంటి వారిని సంప్రదించి ముత్యాల సాగులో మెలుకవలు నేర్చుకొని వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు పొందొచ్చు.