మొబైల్ నెంబర్ పోర్ట్
సాధారణంగా మారుమూల గ్రామాల్లో కొన్ని నెట్వర్క్ కు మాత్రమే సరైన సిగ్నల్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎయిర్ టెల్, జియో సిగ్నల్స్ ఎక్కువగా ఉంటే, కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్-ఐడియా నెట్వర్క్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు తక్కువ సిగ్నల్స్ ఉన్న నెట్వర్క్ వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీరు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేసుకోవాలి.
మొబైల్ నెంబర్ మార్చకుండానే నెట్వర్క్ మార్చుకోవడాన్ని మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటారు. ఉదాహరణకు మీరు BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటే Airtel, Jio లేదా Vi లో ఏ నెట్వర్క్ లోకైనా మారవచ్చు. మీ మొబైల్ నెంబర్‌ను మార్చకుండానే ఈ ప్రాసెస్ చేయవచ్చు.