మీ బ్యాంక్ ద్వారా పేటి‌ఎం ఐ‌పి‌ఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. ? ఈ ప్రక్రియ తెలుసుకోండి

First Published Nov 9, 2021, 12:19 PM IST

డిజిటల్ పేమెంట్(digital payment) యాప్ పేటి‌ఎం(paytm) ఐ‌పి‌ఓ కోసం బిడ్డింగ్ తేదీ ప్రారంభమైంది. అయితే ఈ‌ బిడ్డింగ్ భారతదేశపు అతిపెద్ద ఐ‌పి‌ఓ (ipo)కానుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఐ‌పి‌ఓ ఇష్యూ సైజ్ రూ.18,300 కోట్లు. ఒకవేళ కంపెనీ ఈ లక్ష్యాన్ని సాధిస్తే ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద ఐ‌పి‌ఓ అవుతుంది. 

ఇలాంటి సమయంలో ప్రజలు వారి డబ్బును ఈ ఐ‌పి‌ఓలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. మరోవైపు  దీని బిడ్డింగ్ తేదీ 8 నవంబర్ 2021 నుండి 10 నవంబర్ 2021 వరకు అమలులో ఉంటుంది. అంతేకాదు ఈ ఐ‌పి‌ఓ నుండి పెట్టుబడిదారులు పెద్ద లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. 

పేటి‌ఎం కంపెనీ స్టాక్ ప్రైస్ బ్యాండ్ 2080-2150గా నిర్ణయించింది. కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ నవంబర్ 10. మీ బ్యాంక్ ద్వారా పేటి‌ఎం ఐ‌పి‌ఓలో మీరు ఎలా పెట్టుబడి పెట్టాలనుకుంటే  ఎలానో తెలుసుకోండి ? ఇందులో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి.
 

మీ బ్యాంక్ ద్వారా పేటి‌ఎం ఐ‌పి‌ఓలో పెట్టుబడి పెట్టడానికి మీరు ఈ దశలను అనుసరించాలి
ఇందుకోసం ముందుగా మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఇక్కడ సందర్శించిన తర్వాత నెట్ బ్యాంకింగ్ కోసం లాగిన్ అవ్వండి.
ఇప్పుడు మీరు పెట్టుబడి విభాగంపై క్లిక్ చేయాలి.

ఇక్కడ ఐ‌పి‌ఓ ఆప్షన్ ఎంచుకోండి.
ఇప్పుడు మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీరు వెరిఫికేషన్ కోసం పెట్టుబడి, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి.

 ఇలా చేసిన తర్వాత పేటి‌ఎం ఐ‌పి‌ఓని ఎంచుకోండి.
కొత్త పేజీలో మీరు షేర్లను, బిడ్ ధరను నమోదు చేయాలి.

ఆ తర్వాత డిక్లరేషన్ బాక్స్‌పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు మీ ఫార్మ్ ఆమోదించబడుతుంది ఇంకా ఫండ్ కేటాయింపు తేదీ వరకు మీ మొత్తం అమౌంట్ బ్లాక్ చేయబడుతుంది.

click me!