బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. నేడు పసిడి, వెండి ధరలు ఎంత తగ్గాయంటే..?

First Published Nov 9, 2021, 11:07 AM IST

భారతదేశంలో నిన్న రికార్డు స్థాయిని తాకిన తర్వాత నవంబర్ 9 మంగళవారం బంగారం ధరలు (gold prices)స్థిరంగా ఉన్నాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో నవంబర్ 9న 10:00 గంటల సమయానికి డిసెంబర్ గోల్డ్ ధర స్వల్పంగా 0.03 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 48.002కి చేరుకుంది. 

మరో విలువైన లోహం వెండి ధర కూడా మంగళవారం గణనీయంగా పడిపోయింది. నవంబర్ 5న వెండి ధర 0.18 శాతం క్షీణించి రూ.64,224కి చేరుకుంది.

డిమాండ్ పెరగడంతో గత మూడు రోజులుగా బంగారం ధరలు కూడా పెరుగుతు వస్తున్నాయి. అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంతో బంగారం ధర 0.02 శాతం క్షీణించింది. ఈ పతనం తర్వాత ఎం‌సి‌ఎక్స్ లో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం ధరలు రూ.48,010కి తగ్గాయి. 

గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే మంగళవారం వెండి ధర 0.13 శాతం తగ్గింది. దీని తర్వాత ఫ్యూచర్స్ ట్రేడ్‌లో వెండి ధర కిలోకు రూ.64,797కి తగ్గింది. 

సోమవారం డాలర్ ఇండెక్స్ పతనం కారణంగా బంగారం రెండు నెలల రికార్డు స్థాయికి చేరుకుంది.

గోల్డ్ ఫ్యూచర్స్ సోమవారం ఉదయం 0.3 శాతం లాభపడి 10 గ్రాములకు రెండు నెలల గరిష్ట స్థాయి రూ.48,117కి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా మంచి ర్యాలీని నమోదు చేసింది. నిన్న కిలో వెండి రూ.64,717 వద్ద ట్రేడైంది. కానీ నేడు  తగ్గింది. 

మనం అంతర్జాతీయ బులియన్ మార్కెట్ గురించి మాట్లాడినట్లయితే మార్కెట్ అప్‌ట్రెండ్‌ను చూపుతోంది. మీరు GoldPrice.orgని పరిశీలిస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 09.35 గంటలకు MCXలో బంగారం ధర 0.38 శాతం పెరిగి ఒక గ్రాము రూ. 1,823.17 వద్ద ట్రేడవుతోంది. వెండి కిలోకి 1.04 శాతం పెరిగి రూ.24.83 వద్ద ఉంది.
 

IBJA రేట్లు
మీరు ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అంటే IBJA రేటును పరిశీలిస్తే, ఈ రోజు చివరి అప్‌డేట్‌తో, బంగారం మరియు వెండి ధర ఇలా ఉంది- (ఈ ధరలు GST ఛార్జ్ లేకుండా గ్రాముకు ఇవ్వబడ్డాయి)

(స్వచ్ఛత)- 
999- 48,047
995-47,855 
916- 44,011
750- 36,035
585- 28,107
వెండి 999- 64,537

ఒక వెబ్ సైట్  ను పరిశీలిస్తే ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూ.4,804, 8 గ్రాములకి ​​ రూ.38,432, 10 గ్రాములకి  రూ. ​​48,040, 100 గ్రాములకి ​​రూ.4,80,400గా ఉంది. 10 గ్రాములు చూస్తే 22 క్యారెట్ల బంగారం 46,040కి అమ్ముడుపోతోంది.
 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 45,270 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 49,390 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,040 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,040 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,520 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,220గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,270 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,390గా ఉంది.  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

ఇక వెండి గురించి మాట్లాడినట్లయితే ఒక వెబ్‌సైట్ ప్రకారం కిలో వెండి ధర 64,800 రూపాయలు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800గా ఉంది. ముంబై, కోల్‌కతాలో వెండి ధర కూడా అదే స్థాయిలో ఉంది. చెన్నైలో వెండి కిలో ధర రూ.69,100గా ఉంది.

మీ నగరంలో బంగారం, వెండి ధరల కోసం
 ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరం బంగారం ధరను మొబైల్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరను తనిఖీ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసే నంబర్‌ నుండి మీకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా ఇంట్లో కూర్చొని కూడా బంగారం తాజా ధరలను తెలుసుకోవచ్చు.

click me!