పేటి‌ఎం ఐ‌పి‌ఓ నేడే ప్రారంభం.. ధర నుండి ఇష్యూ వరకు ప్రతిది తెలుసుకోండి

First Published Nov 8, 2021, 11:25 AM IST

డిజిటల్ చెల్లింపుల సంస్థ   పేటి‌ఎం(Paytm) ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌  అంటే  ఐ‌పి‌ఓ (IPO) సబ్‌స్క్రిప్షన్ సోమవారం (నవంబర్ 8) ప్రారంభించింది. గత వారం ప్రారంభంలో ఐదు కంపెనీలు ఐ‌పి‌ఓలను విజయవంతంగా ప్రారంభించాయి. పేటి‌ఎం ఐ‌పి‌ఓ నవంబర్ 10 వరకు తెరిచి ఉంటుంది.ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా పేటి‌ఎం రూ.18,300-కోట్ల షేర్ సేల్  దేశంలోనే అతిపెద్దది.

ఈ ఐ‌పి‌ఓ బిడ్ ఎంత ఉంటుంది?
సమాచారం ప్రకారం పేటి‌ఎం ఐ‌పి‌ఓ సోమవారం నుండి సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. ఇందులో బిడ్డర్లు ఆరు లేదా మల్టీపుల్ ఆధారంగా డబ్బు  పెట్టాల్సి ఉంటుంది. పేటి‌ఎం మాతృ సంస్థ వన్97( One97) కమ్యూనికేషన్ ఈ IPOలో ఒక్క లాట్  తీసుకోవాలంటే కనీసం రూ. 12,480 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. 

ఒక్కో షేరు ధర రెండు వేల రూపాయలకు పైగా..
పేటి‌ఎం ఐ‌పి‌ఓ ప్రైస్ బ్యాండ్ రూ. 2080 నుండి రూ. 2150 వరకు ఉంటుంది. ఈ లాట్ల కేటాయింపు నవంబర్ 15 నాటికి జరుగుతుంది. పేటి‌ఎం షేర్లు నవంబర్ 18న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అవుతుంది. 

ఐ‌పి‌ఓ ఇష్యూ సైజ్ ఎంత?
ఐ‌పి‌ఓ తాజా ఇష్యూ ద్వారా రూ. 8,300 కోట్లను సమీకరించాలని ప్రయత్నిస్తుండగా ప్రస్తుతం ఉన్న వాటాదారులకు రూ. 10,000 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS)ఉంటుంది. అలాగే దేశంలోనే అతిపెద్ద ఐపీఓ అవుతుందని భావిస్తున్నారు. అంతకుముందు 2015లో కోల్ ఇండియా ఐపీఓ రాగా, దాని నుంచి రూ.15,200 కోట్లు సమకూరాయి. పే త్రూ మొబైల్‌ని పేటి‌ఎం అనే పేరుతో పిలువబడే కంపెనీ కొద్ది రోజుల క్రితం యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ.8,235 కోట్లను సేకరించింది. కంపెనీ బ్లాక్‌రాక్, సింగపూర్‌కు చెందిన సి‌పి‌పి‌ఐ‌బి (CPPIB), అబుదాబికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌లను యాంకర్ పెట్టుబడిదారులుగా చేర్చుకుంది.

పేటీఎంలో షేర్లను ఎవరు విక్రయిస్తున్నారు?
సమాచారం ప్రకారం, కంపెనీ సోమవారం నుండి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. పేటి‌ఎం దిగ్గజ పెట్టుబడిదారి ఏ‌ఎన్‌టి ఫైనాన్షియల్ సుమారు 27.9 శాతం లేదా 643 మిలియన్ల వాటాను విక్రయించాలని యోచిస్తోంది. అంతేకాకుండా పేటి‌ఎం మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సి‌ఈ‌ఓ విజయ్ శేఖర్ శర్మ సుమారు రూ.402 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభైన పేటి‌ఎం 
పేటి‌ఎం సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పట్లో  పేటి‌ఎం మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫామ్ గా పేరు పొందింది. అయితే 2016లో దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత, పేటి‌ఎం కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. దీని తరువాత కంపెనీ బీమా, బంగారం అమ్మకాలు, సినిమా, విమాన టిక్కెట్లు, బ్యాంకు లావాదేవీలు మొదలైన వాటిలో కూడా ప్రవేశించింది. పేటి‌ఎంలో దాదాపు 22 మిలియన్ల వ్యాపారులు సంవత్సరానికి $80 బిలియన్ల లావాదేవీలు జరుపుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 337 మిలియన్ల మంది రిజిస్టర్డ్  వినియోగదారులు ఉన్నారు. 

click me!