Surya Nutan: ఇక గ్యాస్ బండ అవసరం లేదు, పగలు, రాత్రి 3 పూటలా పనిచేసే సోలార్ స్టౌ ఇదే...ధర ఎంతంటే..?

First Published Jun 24, 2022, 12:40 AM IST

గ్యాస్ బండ ధరలు సామాన్యులకు గుదిబండలా మారుతున్నాయి. LPG సిలిండర్ ధరలు ఇప్పటికే 1000 రూపాయలు దాటిపోయి మరింత పరుగులు తీస్తున్నాయి. దీంతో సామాన్యులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా  ఎల్‌పిజి ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సోలార్ స్టవ్‌ను విడుదల చేసింది.
 

ఈ స్టౌవ్ ను ఎక్కడైనా , ఎప్పుడైనా అంటే ఏ సీజన్‌లోనైనా ఉపయోగించవచ్చు. ఈ స్టవ్‌కు సూర్య నూతన్ అని పేరు పెట్టారు. దీని ధర 12 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంటే ఒక ఏడాదికి ఖర్చు పెట్టే దాదాపు 12 సిలిండర్ల ఖర్చుతో సమానం.

సూర్య నూతన్‌కి సంబంధించిన ప్రత్యేక విషయాలు

>> దీనిని ఇండియన్ ఆయిల్ , R&D సెంటర్, ఫరీదాబాద్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇది సోలార్ కుక్కర్‌కి భిన్నంగా ఉంటుంది, ఈ స్టవ్ ను ప్రత్యేకంగా సూర్యరశ్మిలో ఉంచాల్సిన అవసరం లేదు , మీ కిచెన్ లో ఉంచుకొనే ఆహారాన్ని వండుకోవచ్చు.

>> దీని ధర ప్రస్తుతం బేస్ మోడల్‌కు 12 వేల రూపాయలు , టాప్ మోడల్‌కు 23 వేల రూపాయలుగా నిర్ణయించారు. దీని టాప్ మోడల్ ధర 12 వేల-14 వేల రూపాయల వరకు రావచ్చని చెబుతున్నారు. 
 

>> ఇది మూడు మోడళ్లను కలిగి ఉంది , ప్రీమియం మోడల్ నలుగురితో కూడిన కుటుంబానికి మూడు సార్లు అంటే అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం కోసం పూర్తి భోజనాన్ని వండు కోవచ్చు. ఇది అన్ని రకాల వాతావరణంలో ఉపయోగించవచ్చు, అంటే శీతాకాలంలో లేదా వర్షాకాలంలో, ఆకాశంలో సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి సమస్య ఉండదు.
 

>> దీని నిర్వహణ కూడా చాలా తక్కువ అని చెబుతున్నారు.  కారణం ఇది హైబ్రిడ్ మోడ్‌లో పనిచేస్తుంది. అంటే సౌర , ఇతర శక్తి వనరులపై ఏకకాలంలో పని చేయగలదు. ఇది రీఛార్జ్ బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. అంటే మీరు రాత్రి పూట కూడా ఆహారాన్ని వండుకోవచ్చు, అంటే నేరుగా సౌరశక్తితో, అలాగే ఛార్జింగ్ అనంతరం కూడా దీనిపై వంట చేసుకోవచ్చు.
 

>> ఈ స్టవ్‌లో ఒక కేబుల్ ఉంది, దాని ఒక చివర ఇంటి కప్పుపై అమర్చిన సోలార్ ప్లేట్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది , సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి కేబుల్ ద్వారా స్టవ్‌లోకి చేరుతుంది. ఈ విధంగా సోలార్ ప్లేట్ థర్మల్ బ్యాటరీలో సౌర శక్తిని నిల్వ చేస్తుంది. ఇది ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు రాత్రిపూట కూడా ఆహారాన్ని ఉడికించగలదు.

click me!