రేంజ్ రోవర్ కార్, ఐఫోన్ వాడుతున్న పతంజలి సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు..

First Published Mar 17, 2021, 12:52 PM IST

నేటి యుగంలో పతంజలి ఆయుర్వేదం ప్రజలలో తనకంటూ ఒక  స్థానాన్ని ఏర్పరచుకుంది. పంజలి ఆయుర్వేదం నుండి ప్రజలు అనేక రకాల మందులు, వారి అవసరాలకు ఉపయోగపడే వాటిని  కొనుగోలు చేస్తుంటారు. 

అయితే పంజలి ఆయుర్వేదం సీఈఓ ఆచార్య బాలకృష్ణ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? అతను ఎలాంటి జీవితం గడుపుతున్నరో తెలుసా ? 2020 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆచార్య బాలకృష్ణ 18 వ స్థానంలో ఉన్నారు. ఆచార్య బాలకృష్ణ జీవన విధానం గురించి తెలుసుకుందాం..
undefined
1995లో ఆచార్య బాలకృష్ణ, బాబా రామ్‌దేవ్‌తో కలిసి వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత దివ్యా ఫార్మసీని స్థాపించారు. 2006లో పతంజలి ఆయుర్వేదంని స్థాపించారు. అప్పటి నుంచి ఆచార్య బాలకృష్ణ వ్యాపారంలో వెనక్కి తిరిగి చూడకుండ బాబా రామ్‌దేవ్‌తో కలిసి ముందుకు సాగారు.
undefined
పతంజలి ఆయుర్వేదం వ్యాపారంలో ఆచార్య బాలకృష్ణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, ఇందులో ఆయనకు 98.5 శాతం వాటా ఉంది. ఇది మాత్రమే కాదు పతంజలి గ్రూప్ స్థాపించిన ఆచార్య బాలకృష్ణ పతంజలి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ కూడా వ్యవహరిస్తున్నాడు.
undefined
ఆచార్య బాలకృష్ణ గురించి చెప్పాలంటే కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఆచార్య బాలకృష్ణ వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం నుండి హై స్కూల్, గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు.
undefined
ఆచార్య బాలకృష్ణ పతంజలి యోగ్‌పీత్ ప్రధాన కార్యాలయ భవనంలో నిర్మించిన ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ఒక చిన్న సాధారణ కార్యాలయంలో పనిచేస్తుంటాడు. అతని కార్యాలయంలో బాబా రామ్‌దేవ్‌తో సహా మరికొందరి ఫోటోలు ఉన్నాయి.
undefined
ఆచార్య బాల్కృష్ణ చాలా సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు, కాని అతనికి రేంజ్ రోవర్ కారు ఉంది, తరచూగా అందులోనే ప్రయాణిస్తాడు.
undefined
కారు మాత్రమే కాదు, ఆచార్య బాల్కృష్ణ కూడా ఐఫోన్‌ను ఉపయోగిస్తాడు. ఆచార్య బాలకృష్ణ ప్రకారం అతను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా పని నుండి సెలవు తీసుకోలేదు.
undefined
ఆచార్య బాలకృష్ణ పూర్తి సంపద గురించి చెప్పాలంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం, అతని వద్ద రూ .46 వేల 800 కోట్లకు పైగా ఉంటుంది.
undefined
click me!