మళ్ళీ నోట్ల రద్దు చేయనున్నారా.. రెండేళ్లలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంటో తెలుసుకోండి ?

First Published Mar 16, 2021, 7:05 PM IST

2016లో చారిత్రాత్మక డీమోనిటైజేషన్ తరువాత కొత్త  రూ.500,  2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో చెలామణిలో ఉన్న పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల నల్లధనాన్ని నిరోదించారు. 

అయితే 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం మరోవైపు కొత్త 2000 నోటును చెలామణిలోకి తీసురవడం గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు వేల నోట్లను కూడా నిలిపివేయవచ్చని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం రెండేళ్లలో ఒక్క కొత్త 2000 నోటు కూడా ముద్రించలేదని ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడంతో ఈ భయం మొదలైంది.
undefined
8 నవంబర్ 2016న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది.30 మార్చి 2018న 2000 రూపాయల 336.2 కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నాయని తాజాగా 26 ఫిబ్రవరి 202న వాటి సంఖ్య 249.9 కోట్లకు వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం పార్లమెంటుకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
undefined
ప్రభుత్వ లావాదేవీల డిమాండ్‌ను తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ సలహా మేరకు నోట్ల ముద్రణ నిర్ణయం తీసుకుంటారు. 2019-20, 2020-21 సంవత్సరాల్లో 2000 రూపాయల నోట్ల ముద్రణకు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు.
undefined
2016-17 ఆర్థిక సంవత్సరంలో 2000 రూపాయల 354 కోట్ల నోట్లను ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. దీని తరువాత, 2017-18లో 11.15 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించారు. 2018-19లో 4.66 కోట్ల నోట్లను ముద్రించారు. ఆ తరువాత అంటే 2019 ఏప్రిల్ నుండి ఒక్క నోటు కూడా ముద్రించబడలేదు.
undefined
1000 రూపాయలు నాట్లను రద్దు చేసి కొత్త 2000 రూపాయలు నోట్లను తీసుకురావాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థికవేత్తల దృష్టిలో ఎప్పుడూ ఉంటుంది.
undefined
నల్లధనం వ్యాప్తిని ఆపడానికి డీమోనిటైజేషన్ జరిగితే, ఇంత పెద్ద మొత్తంలో నోట్లను చలామణిలోకి తీసుకురావడం ఎలా సముచితమని ఆయన అన్నారు. నల్లధనాన్ని నిషేధించటానికి వీలుగా ప్రభుత్వం రెండువేల రూపాయల నోటును కూడా రద్దు చేయవచ్చని కొందరు నమ్ముతారు.
undefined
click me!