మీకు ఈ 7 బ్యాంకుల్లో అక్కౌంట్ ఉందా..? అయితే ఏప్రిల్ 1 తర్వాత వీటికి చెల్లుచీటి

First Published Mar 17, 2021, 11:13 AM IST

న్యూ ఢీల్లీ: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఏడు బ్యాంకుల చెక్ బుక్స్, పాస్‌బుక్‌లు చెల్లుబాటు ముగియనున్నది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ ఇతర బ్యాంకులతో విలీనం కానున్నాయి.

ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు వెంటనే కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల విలీనం కారణంగా మార్చబడిన ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను విడిగా అడిగి తెలుసుకోండి.
undefined
1 ఏప్రిల్ 2019న ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అయ్యాయి. మార్చి 31న విలీన ప్రక్రియ ముగియడంతో పాత బ్యాంకులు, బ్యాంకుల చెక్ బుక్స్, పాస్‌బుక్‌లు ఇకపై ఉండవు. ఈ 7 బ్యాంకుల్లో కస్టమర్ ఖాతా ఉంటే త్వరగా కొత్త చెక్ బుక్ ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ పొందటం మంచిది.
undefined
దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాగా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. ఆంధ్రా బ్యాంక్ అలాగే కార్పొరేషన్ బ్యాంక్ వినియోగదారులు తమ కొత్త ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in నుండి తెలుసుకోవచ్చు.
undefined
లేదా 18002082244, 18004251515 లేదా 18004253555 కు కాల్ చేయండి. మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా ఈ మాచారాన్ని పొందవచ్చు. ఇందు కోసం మీరు IFSC <OLD IFSC> అని టైప్ చేసి 9223008486 కు మెసేజ్ పంపాలి. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి వర్తిస్తాయి. అయితే విలీనం కారణంగా బ్యాంక్ అక్కౌంట్ నెంబర్ , ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్, ఎం‌ఐ‌సి‌ఆర్ కోడ్, బ్రాంచ్ చిరునామా కూడా మార్చబడతాయి.
undefined
undefined
click me!