ఎలాన్ మస్క్ టు ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ట్విట్టర్ కొత్త బాస్‌కి అభినందనల వెల్లువ..

First Published | Nov 30, 2021, 6:22 PM IST

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జాక్ డోర్సే(jack dorsey) తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఇప్పుడు అతని స్థానంలో  భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(parag agarwal) ట్విట్టర్  కొత్త సి‌ఈ‌ఓగా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ (twitter)కొత్త సి‌ఈ‌ఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో అతనిపై  అభినందనలు వెల్లువెత్తాయి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ నుండి భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వరకు అతనికి ట్వీట్ చేయడం ద్వారా అభినందనలు తెలిపారు. 

 భారతీయ సి‌ఈ‌ఓ ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని మీకు తెలిసిందే. డిఫరెంట్ స్టైల్‌లో ట్వీట్ చేయడంలో కూడా ఆనంద్ మహీంద్రా ప్రసిద్ది చెందారు. పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు భిన్నమైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సంతతికి చెందిన వ్యక్తి సి‌ఈ‌ఓ అయినందుకు నేను సంతోషిస్తున్నాము, గర్విస్తున్నాము అంటూ ట్వీట్ చేశాడు. భారతీయ సి‌ఈ‌ఓ వైరస్ కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ లేదు. పరాగ్ అగర్వాల్‌కి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

ఎలోన్ మస్క్ 
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, స్పేస్ ఎక్స్ (SpaceX) అండ్ టెస్లా సి‌ఈ‌ఓ (Tesla CEO) ఎలోన్ మస్క్ కూడా భారతీయ ప్రతిభను ప్రశంసించారు. ట్విటర్‌ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను అభినందిస్తూ, భారతీయ ప్రతిభతో అమెరికా ఎంతో ప్రయోజనం పొందిందని అన్నారు.


పాట్రిక్ కొల్లిసన్ ట్వీట్‌ 
ఎలోన్ మస్క్ అండ్ ఆనంద్ మహీంద్రా స్ట్రైప్ కంపెనీ సి‌ఈ‌ఓ అండ్ సహ వ్యవస్థాపకుడు పాట్రిక్ కొల్లిసన్ ట్వీట్‌కు రిప్లయి ఇస్తూ పరాగ్ అగర్వాల్‌ను ప్రశంసించారు. పాట్రిక్ పరాగ్‌ను అభినందిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్, పాలో ఆల్టో ఇప్పుడు ట్విట్టర్‌ని నడుపుతున్న సిఇఓలందరూ భారతదేశంలోనే పెరిగారని రాశారు. టెక్ ప్రపంచంలో భారతీయుల అద్భుత విజయాన్ని చూడటం సంతోషాన్నిస్తుంది. పరాగ్‌కి చాలా అభినందనలు అని అన్నారు.

Latest Videos

click me!