ఓయోను రితేష్ అగర్వాల్ ప్రారంభించారు. ఆయన నవంబర్ 16, 1993న ఒడిశా రాష్ట్రం, బిస్సం కటక్‌లో జన్మించారు. చిన్న వయసులోనే వ్యాపార దృక్పథం పెంచుకున్న రితేష్, 19 ఏళ్లకే ఓయో ప్రారంభించారు. Hurun India Rich List 2024 ప్రకారం, ఆయన భారతదేశంలో టాప్ 10 యువ బిలియనీర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రితేష్ నికర సంపద సుమారు రూ.1,900 కోట్లు ($225 మిలియన్)గా ఉంది. రితేష్ అన్అకాడమీ, కార్స్24, జింగ్ బస్, టాఫీ కిడ్స్ వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.