ITR Filing: ఆ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఈ జరిమానాలు తప్పవు, ఇలా ఆన్‌లైన్లో దాఖలు చేయండి

Published : Sep 05, 2025, 10:47 AM IST

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్  చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. చాలా తక్కువ సమయమే ఇంకా మిగిలి ఉంది. ఈ లోపే మీరు ఐటీఆర్ ఫైల్ చేయండి. ఆ గడువు దాటితే మీకు ఎలాంటి జరిమానాలు పడతాయో తెలుసుకోండి. వీలైనంత వరకు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నించండి. 

PREV
16
ఐటీఆర్ ఫైల్ చేయలేదా?

ఆదాయం ఉన్న ప్రతి ఒక్కూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. లేకపోతే మీరు శిక్షకు అర్హులు. కానీ ఇప్పటికీ ఎంతో మంది ఐటీఆర్ ఫైల్ చేయడం లేదు. అలా చేయకపోతే  సెక్షన్ 234F కింద జరిమానాలు పడవచ్చు.  గడుపు దాటాక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేస్తే జరిమానా  విధిస్తారు. 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి గరిష్టంగా 5,000 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి గరిష్టంగా 1,000 రూపాయల జరిమానా పడుతుంది.

26
సెప్టెంబర్ 15లోపు

మీరు ఈ నెల అంటే సెప్టెంబర్ 15 లోపు ఐటీఆర్ దాఖలు చేయాలి. లేకపోతే మీరు ఆలస్యంగా రిటర్న్‌ను డిసెంబర్ 31, 2025 వరకు దాఖలు చేయవచ్చు. దీన్ని సెక్షన్ 139(4) కింద దాఖలు చేస్తారు. దీనికి జరిమానా పడుతుంది.  కాబట్టి ఆలస్యం కాకుండా సెప్టెంబరు 15లోపు ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.

36
రిఫండ్ ఆలస్యం కావచ్చు

ఐటీఆర్ మీరు ఆలస్యంగా ఫైల్ చేస్తే మీకు రావాల్సిన ఆదాయపు పన్ను రిఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.  ఎక్కువ పన్ను చెల్లించిన వారికి త్వరగా రిఫండ్ రాదు. సమయానికి దాఖలు చేయడం వల్ల రిఫండ్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. 

46
నోటీసు వచ్చే ప్రమాదం

ఐటీఆర్ సమయానికి దాఖలు చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావచ్చు. నోటీసు వస్తే మీరు అదనపు సమయం, డాక్యుమెంట్లను సమర్పించాల్సి రావచ్చు. సమయానికి దాఖలు చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చు.

56
లోన్ లో ఇబ్బంది రాకుండా...

ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల అది  మీ క్రెడిట్ చరిత్రను ప్రభావితం చేస్తుంది. అలాగే మీ లోన్ రికార్డుపై ప్రభావం చూపుతుంది. వచ్చే ఏడాది మీకు లోన్ లేదా క్రెడిట్ కావాలంటే త్వరగా రాకపోవచ్చు. బ్యాంకులు అభ్యంతరం చెప్పవచ్చు. కాబట్టి లోన్ విషయంలో ఇబ్బంది రాకుండా ఉండాలంటే సమయానికి ఐటీఆర్ దాఖలు చేయండి.

66
ఐటీఆర్‌ను ఎలా ఫైల్ చేయాలి?
  • www.incometax.gov.in పై ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయండి.
  • మీ పాన్, ఆధార్ వివరాలను నమోదు చేయండి.
  • మీ ఆదాయం, వర్గానికి అనుగుణంగా ఫారమ్‌ను ఎంచుకోండి.
  • జీతం, వడ్డీ, ఇతర ఆదాయం వంటి వివరాలను నమోదు చేయండి.
  • చెల్లించిన పన్ను, మినహాయింపులను నమోదు చేయండి.
  • ఒకసారి చివరిగా తనిఖీ చేసి సమర్పించండి.
  • ఐటీఆర్-Vని డౌన్‌లోడ్ చేసి ఈ-వెరిఫై చేయండి.
  • మీ ఐటీఆర్ 100 శాతం సరైనది. ఈ-వెరిఫై పూర్తయితే అది పూర్తిగాఫైల్ చేసినట్టే.
Read more Photos on
click me!

Recommended Stories