OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు

Published : Dec 14, 2025, 10:27 AM IST

OYO: ఓయోతో పాటు ఇత‌ర రూమ్స్ బుకింగ్ స‌మ‌యంలో క‌చ్చితంగా ఆధార్ స‌బ్‌మిట్ చేయాల‌నే విష‌యం తెలిసిందే. హోట‌ల్ యాజ‌మాన్యం ఆధార్ జిరాక్స్‌ల‌ను తీసుకుంటాయి. అయితే ఇక‌పై ఆ అవ‌స‌రం ఉండ‌దు. 

PREV
15
ఇక‌పై ఆధార్ పేపర్ కాపీలు అవ‌స‌రం ఉండ‌వు

కస్టమర్లు ఇచ్చే ఆధార్ కార్డు ఫోటోకాపీలను ఇకపై OYO, హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు తీసుకోరు. వాటిని ఫైళ్లలో నిల్వ చేయడం కూడా నిషేధం కానుంది. ఆధార్ సమాచార భద్రతను పెంచే దిశలో యూఐడీఏఐ ఈ పెద్ద మార్పు అమలు చేయబోతోంది.

25
రిజిస్ట్రేషన్ తప్పనిసరి – హోటళ్ల‌కు కొత్త నిబంధన

ఆధార్ ఆధారిత ధృవీకరణ కోరే సంస్థలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ఆమోదించిన ఈ నిబంధన త్వరలో అమల్లోకి రానుంద‌ని.. CEO భువనేష్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాతే హోటళ్లు లేదా ఈవెంట్ నిర్వాహకులు ఆధార్ వెరిఫికేషన్‌కు సంబంధించిన సేవలను పొందుతారు.

35
QR కోడ్, కొత్త‌ యాప్

భవిష్యత్తులో ఫొటోకాపీ అవసరం లేకుండా QR కోడ్ స్కాన్ చేయడం లేదా రూపొందిస్తున్న కొత్త ఆధార్ యాప్ ద్వారా వ్యక్తుల వివరాలు వెంటనే వెరిఫై అవుతాయి. ఈ విధానం పాత సర్వర్ సమస్యల్ని తగ్గిస్తుంది. సంస్థలు API సదుపాయం పొందడంతో ధృవీకరణ ప్రక్రియను తమ సిస్టమ్‌లలోనే అమలు చేయగలవు.

45
విమానాశ్రయాల నుంచి దుకాణాల వరకు

యాప్-టు-యాప్ వెరిఫికేషన్‌తో విమానాశ్రయాలు, వయస్సు నిర్ధారణ తప్పనిసరి చేసే దుకాణాలు, లాడ్జింగ్ సంస్థలు ఈ సాంకేతికతను వినియోగించగలవు. కేంద్ర సర్వర్‌కి ప్రతి సారి కనెక్షన్ అవసరం లేకుండానే ఆధార్ సమాచారం నిజమో కాదో నిర్ధారించవచ్చు.

55
వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యం

పేపర్‌లెస్ వెరిఫికేషన్‌తో ఆధార్ డేటా లీక్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. రాబోయే యాప్‌లో అడ్ర‌స్ ప్రూఫ్‌ అప్‌డేట్ చేసే అవకాశం, మొబైల్ లేని కుటుంబ సభ్యులను యాప్‌కు జోడించే సదుపాయం కూడా ఉంటుంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం, ఈ నూతన వ్యవస్థ 18 నెలల్లో పూర్తిగా అమ‌ల్లోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories