Online shopping: పండగ సీజన్ వచ్చేసింది. దీంతో అన్ని ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమంలో కొన్ని ట్రిక్స్ పాటిస్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండుగ షాపింగ్ ప్రారంభించేముందే మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోండి. బహుమతులు, అలంకరణ వస్తువులు, దుస్తులు వేరు వేరు బడ్జెట్‌లతో ప్లాన్ చేయడం వల్ల అనవసర ఖర్చు తగ్గుతుంది. ముందుగానే బడ్జెట్ నిర్ణయించడం వలన మీరు అదనపు ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు. అయితే బడ్జెట్‌కి మించి కొనుగోలు చేయకూడదనే షరతు పెట్టుకోండి, కచ్చితంగా పాటించండి.
25
ఆఫర్లు, డిస్కౌంట్‌లను జాగ్రత్తగా పరిశీలించండి
పండుగ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సైట్‌లు పెద్ద డిస్కౌంట్‌లను ఇస్తాయి. కానీ ప్రతి ఆఫర్ నిజంగా సులభమైన డీల్ కాదని గమనించండి. మీరు నిజంగా కావాల్సిన ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి. మార్కెటింగ్ గిమ్మిక్స్ ద్వారా ఆకర్షితులవ్వకండి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో అవసరం లేని వస్తువులు కూడా కొనాల్సి వస్తుంది.
35
ధరలను సరిపోల్చడం
ఒకే ఉత్పత్తి ధరలు వెబ్‌సైట్‌లలో మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు రెండు లేదా మూడు సైట్‌లలో ధరలు చూసి, ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ ధరలను కూడా సరిపోల్చండి. దీని ద్వారా మీరు చౌకైన డీల్‌ని పొందగలరు.
క్రెడిట్ కార్డు ఉపయోగించడం సౌకర్యంగా ఉంటే కూడా, బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారాలు వస్తాయి. పెద్ద ఖర్చుల కోసం నగదు లేదా డెబిట్ కార్డు ఉపయోగించడం మంచిది. EMI ప్లాన్లను జాగ్రత్తగా చూడండి, అవసరమైతే వాయిదా వేయండి.
55
రేటింగ్స్ చూసి కొనుగోలు చేయండి
ఎలక్ట్రానిక్స్, ఖరీదైన బహుమతులు కొనుగోలు చేసే ముందు వినియోగదారుల సమీక్షలు, రేటింగ్స్ తప్పక పరిశీలించండి. నాణ్యమైన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేందుకు మీకు ఇది ఉపయోగపడుతుంది. అప్పటికే ఆ వస్తువును ఉపయోగించిన వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ మీకు ఉపయోగపడొచ్చు.