Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు కేవలం రూ. 1కే బంగారం కొనే అవకాశం..ఎక్కడ, ఎలా కొనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Published : Apr 21, 2023, 07:08 PM IST

అక్షయం అంటే క్షయం లేనిది అని అర్థం అంటే నాశనం అనేది లేనిది అని  పండితులు చెబుతున్నారు.  ఈరోజు బంగారం రవ్వంతైనా కొనుగోలు చేస్తే వచ్చే అక్షయ తృతీయ నాటికి కోటీశ్వరుడు రావడం ఖాయం అని శాస్త్రాలు చెబుతున్నాయి.  అందుకే జనం అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.   

PREV
15
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు కేవలం రూ. 1కే బంగారం కొనే అవకాశం..ఎక్కడ, ఎలా కొనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అక్షయ తృతీయ రోజు బంగారం షాపులన్నీ కిటకిటలాడటానికి ఇదే కారణం.  అయితే ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది.  ఎందుకంటే ఈ సెంటిమెంటు కారణంగా ప్రతి ఒక్కరు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు.  అయితే మీరు కూడా ఈ సెంటిమెంటును ఫాలో అవ్వాలని అనుకుంటున్నారా కానీ మీ వద్ద తగినంత డబ్బు లేదని బాధపడుతున్నారా అయితే ఏ మాత్రం కూడా నిరాశ చెందవద్దు కేవలం ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుగోలు చేసే అవకాశం ప్రస్తుత డిజిట్ యుగంలో మనకి లభిస్తుంది. . అది ఎలాగో మనం తెలుసుకుందాం. 
 

25

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం అనేది అలవాయితీ కానీ ప్రస్తుతం బంగారం ధర ఏకంగా 10 గ్రాముల విలువైన 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 62000 దాటిపోయింది ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.  ఒక చిన్న గొలుసు కొనాలన్నా కూడా దాదాపు లక్ష రూపాయల పైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో అసలు బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క రూపాయి బంగారం కొనుగోలు చేయడం అనేది సాధ్యమేనా అని మీకు ఆలోచన రావచ్చు.  కొంపదీసి ఎగతాళిగా మేము చేస్తున్నారా అనే సందేహం కూడా మీకు కలిగే ఆస్కారం ఉంది. 

35

కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు కేవలం ఒక్క రూపాయికే మనం అంతకు తగ్గ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసే వీలుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  ప్రముఖ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అయినా ఫోన్ పే, పేటియం వంటి సంస్థలు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ డిజిటల్ ప్లాట్ఫారం యాప్స్ బంగారం కొనుగోలు చేసేందుకు డిజిటల్ వాలెట్స్ ను సౌకర్యం కల్పిస్తున్నాయి.
 

45

ముఖ్యంగా డిజిటల్ వాలెట్స్  లో మీరు డిజిటల్ రూపంలో మీరు బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.  ఒక్క రూపాయికి కూడా బంగారాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.  ఈ డిజిటల్ వాలెట్ లోని బంగారాన్ని మీరు ఫిజికల్ గా అంటే కాయిన్ల రూపంలోనూ కడ్డీల  అందుకే అదిరూపంలోనూ కొనుగోలు చేయాలనుకుంటే డెలివరీ ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మీకు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ లో బంగారాన్ని ఇంటికే డెలివరీ చేస్తారు. అయితే ఫిజికల్ రూపంలో మీరు బంగారాన్ని పొందాలంటే కనీసం అర గ్రామం నుంచి ఒక గ్రాము వరకు బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 

55

అయితే ఒక రూపాయి కి ఎంత బంగారం వస్తుందని మీ ఆలోచిస్తున్నారా రూ.1 కి 0.0001 గ్రాముల బంగారాన్ని కొని మీ డిజిటల్ వాలెట్ లో భద్రపరుచుకోవచ్చు. అంతేకాదు మీరు ప్రతి నెల కొంత మొత్తం డబ్బు కేటాయించి బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు లాభాన్ని పొందవచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories