గత ఆర్థిక సంవత్సరం బంగారం 18.02 శాతం, వెండి శాతం. 9.42 శాతం పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి ప్రభావాల వల్ల స్టాక్ మార్కెట్ లు ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. అదే సమయంలో బంగారం, వెండి సురక్షితమైన పెట్టుబడులుగా బావించడంతో,. బంగారం మరోసారి రూ.60,000 మార్కును దాటింది. అదే సమయంలో, వెండి కూడా రూ.70,000 మార్కును దాటింది. అయితే బంగారం ర్యాలీ మరికొద్ది నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.