Gold Rate: బంగారం ధర తులం రూ.62 వేలు దాటిపోయింది..ఈ రేటులో నగలు కొంటే లాభమా..నష్టమా..భవిష్యత్తులో తగ్గుతుందా..

Published : Apr 20, 2023, 07:59 PM IST

బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉన్నాయి. గురువారం బంగారం ధర ఏకంగా రూ. 62,000 దాటింది. ఈ నేపథ్యంలో బంగారు నగలు కొనుగోలు చేసే వారికి, ఇది బ్యాడ్  న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా వివాహాది శుభకార్యాలకు బంగారు నగలను కొనుగోలు చేయడం అనేది మన ఆనవాయితీ. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలు చూసి చాలామంది బంగారు నగలు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. మరి కొంతమంది తప్పనిసరి అనుకున్న వాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. భవిష్యత్తులో బంగారం తగ్గుతుందా కనీసం ఒక వెయ్యి రూపాయలైనా తగ్గుతుందా..అనే ఆలోచనలో సామాన్యులు ఉన్నారు. 

PREV
16
Gold Rate: బంగారం ధర తులం రూ.62 వేలు దాటిపోయింది..ఈ రేటులో నగలు కొంటే లాభమా..నష్టమా..భవిష్యత్తులో తగ్గుతుందా..

బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు దీనికి అంతర్జాతీయంగా పలు కారణాలను చూపిస్తున్నారు ముఖ్యంగా బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమై ఉంటుంది ఈ కారణంగా పసిడి ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. 

26

బంగారం ధర పెరగడానికి ఒకటి రెండు కాదు. చాలా కారణాలు ఉణ్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతీయులు బంగారం ఎక్కువగా కొంటారు. అందులోనూ దక్షిణ భారతీయులు అధికంగా బంగారం కొంటారు. దీని వల్ల బంగారం రేటు పెరుగుతోందని అనుకోవడం తప్పు..  భారత్‌లో బంగారానికి మంచి మార్కెట్ ఉన్న మాట వాస్తవమే. .. కానీ ప్రపంచం మొత్తం బంగారం రేటు పెరగడానికి,. ఇటీవలి కాలంలో చాలా కారణాలు ఉన్నాయి. 

36

బ్యాంకింగ్ సంక్షోభాలు. ఆర్థిక  మాంద్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక కారణాల వల్ల పెట్టుబడిదారులకు బంగారం హాట్ ఫేవరెట్ మారుతోంది. ఎందుకంటే, బంగారం ధర తగ్గడం లేదు. బంగారం ధర ఎప్పటికీ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కాబట్టి బంగారంపై పెట్టుబడి సురక్షితమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. 

46

కోవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. పెట్టుబడిదారులు అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బును కోల్పోయారు. దీంతో మదుపుదారులు బంగారంపై పెట్టుబ‌డులు సురక్షిత‌మ‌ని  చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. భారత్ బంగారాన్ని  డాలర్ రూపంలో చెల్లించి కొనుగోలు చేస్తుంది. సహజంగానే ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాలి దీంతో  బంగారం ధర పెరుగుతోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ నిర్ణయం కూడా బంగారం ధరల పెరుగుదలకు దారితీసింది. కేంద్ర బడ్జెట్‌లో బంగారం కడ్డీలపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా బంగారం ధర అమాంతం పెరిగింది.

56

బంగారం ధర తగ్గే అవకాశం చాలా తక్కువ అని చెప్పొచ్చు. 2023 చివరినాటికి బంగారం ధర 10 గ్రాములకు 75,000కు పెరగవచ్చని ముందుగా అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 2022లో 10 గ్రాముల బంగారం ధర రూ.49,540. ఉంది. అయితే ఫిబ్రవరి, 2023 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.56,750కు చేరుకుంది.  కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఒక్క నెలలోనే, అంటే ఫిబ్రవరి 2, 2023న 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.60,370కి పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర రూ. 62 వేలకు పెరిగింది. 

66

అయితే ప్రస్తుతం మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఈ రేటు వద్ద మీరు కొనుగోలు చేయవచ్చు రేటు తగ్గుతుందని ఆశ పెట్టుకోవడం నిరాశే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అది స్వల్పంగానే ఉంటాయి తప్ప భారీగా అయితే తగ్గదని నిపుణులు పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మీ పెట్టుబడిలో కొంత భాగము బంగారానికి కేటాయిస్తే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories