బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కి రాసిన లేఖలో, ఓలా ఎలక్ట్రిక్ డిస్కౌంట్ గురించి వివరించింది. పండుగ సమయంలో అన్ని కస్టమర్లకు రూ.5,000 డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ ధృవీకరించింది. ఎంపిక చేసిన కొందరికి రూ.25,000 వరకు అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉంది, స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అని వివరించింది.